Home » Tag » Telangana Movement
సీఎం రేవంత్ రెడ్డి సార్... నన్ను యాది మీద యాది చేసిండు. ఇప్పుడేమో సప్పుడే చేస్తలేడు...
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో 2011లో నిర్వహించిన రైల్ రోకో కేసులో ఆయన్ను A-15గా పోలీసులు పేర్కొన్నారు.
గన్ పార్క్ (Gun Park) చుట్టూ ఇనుప కంచెలు.. తెలంగాణ కోసం మలిదశ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన వారి కోసం తెలంగాణ అసెంబ్లీ ఎదుట ఉన్న అమరవీరుల స్థూపం.. గన్ పార్క్ వద్ద శుక్రవారం ఇనుప కంచెలు మొలిచాయి.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో (Telangana Movement) సింగర్ సాయిచంద్‌కు (Singer Saichand) ఉన్న స్థానం ఎప్పుడూ ప్రత్యేకం. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలకు ఎంత ప్రధాన్యత ఉందో ప్రత్యేక తెలంగాణ వచ్చిన వచ్చిన తరువాత సాయిచంద్‌కు కూడా అంతే ప్రధాన్యత ఇచ్చారు గులాబీ బాస్ కేసీఆర్ (KCR) .
మిలియన్ మార్చ్ ఈ పేరు తెలియని వ్యక్తులు ఉండరు. తొలి దశ తెలంగాణ ఉద్యమం తర్వాత.. ఆ తరహాలో మలిదశ ఉద్యమంలో తెలంగాణలో జరిగిన అత్యంత కీలక ఘట్టం ఈ మిలియన్ మార్చ్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు 2011, మార్చి 10న హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై మిలియన్ మార్చ్ చేపట్టారు. ఈ ఉద్యమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా, ఉద్యోగ, విద్యా సంఘాలతో పాటు కవులు, రచయితలు, కళాకారులు, న్యాయవాదులు స్వచ్ఛందంగా పాల్గొని ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను కేంద్రానికి చాటిచెప్పారు. మిలియన్ మార్చ్ చేపట్టి నేటికి సరిగ్గా 13 సంవత్సరాలు అవుతుంది.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ఆ తర్వాత రాజకీయ పార్టీగా మారింది. తెలంగాణ వచ్చాక పదేళ్ళు పాలించింది. ఇక తమకు తిరుగులేదు అనుకున్న ఆ పార్టీ చీఫ్ కేసీఆర్.. టీఆర్ఎస్ ను భారత రాష్ట్ర సమితిగా మార్చేశారు. ఉన్నట్టుండి మోడీ మీద అంతెత్తున ఎగిరిపడుతూ.. బీఆర్ఎస్ పార్టీగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పోటీ చేసి.. ఢిల్లీలో చక్రం తిప్పాలనుకున్నారు. కానీ పాపం కథ అడ్డం తిరిగింది.
మలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది అంటే.. శ్రీకాంతాచాలి బలిదానమే కారణం. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆయన కుటుంబానికి సరైన న్యాయం దక్కలేదు అని పదేళ్లుగా వినిపిస్తూనే ఉంది. శ్రీకాంతాచారి తల్లికి ఎందుకు ఎమ్మెల్సీ ఇవ్వలేదని.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు కాంగ్రెస్ నిలదీసింది. ఐతే ఇప్పుడు తెలంగాణలో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చింది. శ్రీకాంతాచారి తల్లికి కీలక పదవి కట్టబెట్టబోతుందా అనే చర్చ జరుగుతోంది.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎందరో ఉద్యమాలు చేశారు. యువకులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు, విద్యార్థులు.. ఇలా సకల జనులు పాల్గొనడం వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైంది. ఇలా పోరాడిన వేల మందిపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేలల్లో కేసులు నమోదు చేసింది.
తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు నవంబర్ 29 వ తేదీన ఉంది. ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన రోజుకు మూలం నవంబర్ 29 కి ప్రత్యేక గుర్తింపు. దేశంలో అనేక రాజకీయ పార్టీలు వచ్చాయి. కనుమరుగు అయ్యాయి. ఎత్తిన జెండా దించకుండా తెలంగాణను సాధించిన ఘనత కేసీఆర్ కు దక్కుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని తేలేకపోతే రాళ్లతో కొట్టిచంపండి అని ధైర్యంగా చెప్పింది కేసీఆర్. ఆమరణ నిరాహార దీక్షతో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా కేసీఆర్ తెగించి పోరాడి తెలంగాణ సాధించారు.
గద్దర్ కుమార్తె వెన్నెలతో ప్రత్యేక ఇంటర్వూ.