Home » Tag » test
భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరి టెస్ట్ సిడ్నీ వేదికగా జరగబోతోంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా క్రికెటర్లు పింక్ కలర్ కాంబినేషన్ తో ఉన్న జెర్సీ, క్యాప్ లను ధరించబోతున్నారు.
జాతీయ జట్టుకు ఆడడం ప్రతీ యువక్రికెటర్ కల... ఆ కల నెరవేరిన క్షణం నుంచి అసలైన సవాల్ మొదలవుతుంది... టీమిండియాలోకి వచ్చేంత వరకూ ఎంత కష్టపడాలో తర్వాత జట్టులో ప్లేస్ ఉండాలంటే అంతకుమించి కష్టపడాల్సిందే... ఎందుకంటే ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో ప్రతీ ప్లేస్ కూ కనీసం నలుగురు పోటీపడుతున్నారు.
అంతర్జాతీయ క్రికెట్ కు టీం ఇండియా స్పిన్ సైంటిస్ట్ ఆర్ అశ్విన్ గుడ్ బై చెప్పాడు. గబ్బాలో జరిగిన మూడో టెస్ట్ ముగిసిన అనంతరం అశ్విన్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు.
న్యూజిలాండ్ చేతిలో భారత్ జట్టు 0-3తో టెస్ట్ సిరీస్ ను ఓడిపోవడం ప్రపంచ క్రికెట్ నే ఆశ్చర్యపరిచింది. టెస్ట్ క్రికెట్ లో అత్యుత్తమ ప్రదర్శనతో గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న టీమిండియా ఇలాంటి ఓటమి చవిచూస్తుందని ఎవ్వరూ అనుకోలేదు.
సొంతగడ్డపై ఊహించని పరాభవం చవిచూసిన టీమిండియా ఇప్పుడు మూడో టెస్టుపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే సిరీస్ చేజారిపోయిన నేపథ్యంలో క్లీన్ స్వీప్ అవమానాన్ని తప్పించుకోవాలంటే చివరి టెస్టులో గెలిచి తీరాలి. పైగా ఈ మ్యాచ్ లో విజయం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసుకు కీలకం కానుంది.
బెంగళూరులో న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా...ఘోరంగా ఓడిపోయింది. తొలి ఇన్నింగ్స్ లో అయితే...మూడో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. పిచ్ ను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారా ? లేదంటే బిజీ షెడ్యూల్...ప్లేయర్ల ఆటతీరుపై ప్రభావం చూపుతోందా ?
బెంగళూరు టెస్టులో ఓటమి తర్వాత ఆటగాళ్లంతా పెవిలియన్ చేరుతుంటే కేఎల్ రాహుల్ మాత్రం భిన్నంగా ప్రవర్తించాడు. మొదట సహచరులతో కలిసి రాహుల్ డ్రెస్సింగ్ రూమ్ వైపే నడిచాడు. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా వెనక్కి వచ్చి పిచ్‌కు మొక్కి వెళ్లాడు.
వర్షం కారణంగా తొలిరోజు ఆట రద్దయినా రెండోరోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా భారత్, కివీస్ తొలి టెస్ట్ ఆరంభమైంది. అయితే ఈ మ్యాచ్ భారత్ ఫ్యాన్స్ కు షాకివ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఎవ్వరూ ఊహించని విధంగా కేవలం 46 పరుగులకే భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది.
న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ కు ముందు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. టెస్టుల్లో 9 వేల పరుగుల మైలురాయిని ముంగిట నిలిచాడు. మరో 53 పరుగులు సాధిస్తే టెస్టుల్లో ఈ మైలురాయి అందుకున్న నాలుగో భారత క్రికెటర్‌గా విరాట్ కోహ్లి రికార్డులకెక్కుతాడు.
భారత పర్యటనకు సిద్ధమవుతున్న న్యూజిలాండ్ జట్టుకు కష్టాలు మొదలయ్యాయి. లంక టూర్ ముగిసిన వెంటనే టిమ్ సౌథీ కెప్టెన్సీ నుంచి తప్పుకోగా... ఇప్పుడు వరుస గాయాలు కివీస్ ను వెంటాడుతున్నాయి.