Home » Tag » Thummala Nageswara Rao
ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకి అప్పగించేందుకు హస్తం పార్టీ సిద్ధం అయిందనే టాక్ వినిపిస్తోంది. ఐతే అదే కొత్తగూడెం స్థానం నుంచి పోటీ చేయాలని పొంగులేటి భావిస్తున్నారు. నిజానికి కాంగ్రెస్‌లో చేరడానికి ముందు ఆయన పెట్టిన కండిషన్ కూడా ఇదే..!
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టి విక్రమార్కతో తుమ్మల సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని తుమ్మల నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరికపై చర్చించారు.
మాజీ మంత్రి, ఖమ్మం జిల్లా కీలక నేత తుమ్మల నాగేశ్వరరావు.. హస్తం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తనకు పాలేరు టికెట్ కావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి కాంగ్రెస్ కూడా ఓకే చెప్పిందని టాక్. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్లు రవి వంటి కాంగ్రెస్ నేతలు తుమ్మలను గురువారం కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు.
తుమ్మల కాంగ్రెస్‌లోకే వెళ్తారనే ప్రచారం జిల్లావ్యాప్తంగా మరింత ఊపందుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా తుమ్మలను కలిసేందుకు గండుగలపల్లిలోని ఆయన ఇంటికి నాయకులు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు.
పాలేరు టిక్కెట్ కందాలకు కేటాయిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తనకు టిక్కెట్ కేటాయించకపోవడంతో అసంతృప్తితో ఉన్న తుమ్మల శుక్రవారం తన అనుచరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
2018 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో తుమ్మల ప్రభావం క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. అయినప్పటికీ తుమ్మల ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పట్టుకోల్పోలేదు. పైగా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పని చేసి ప్రతికూల పరిస్థితుల్లోనూ తన క్యాడర్‌ను కాపాడుకుంటూ వచ్చారు.
2018 ఎన్నికల తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో తుమ్మల ప్రభావం క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. ఐనా సరే ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తుమ్మల పట్టుకోల్పోలేదు. గత ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసిన ఆయన.. కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.