Home » Tag » Thunderstorms
హైదరాబాద్లో నిన్న నుంచి వర్షపు తొలకరి చునుకులు ఆగకుండా కురుస్తున్నాయి. దీంతో పలు చోట్ల రహదారులపై వర్షపు నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ముసురు ఎప్పుడు పోతుంది? వారం రోజులుగా కనిపించకుండా పోయినా సూరీడు ఎప్పుడు వస్తాడని నగరవాసులు ఎదురుచూస్తున్నారు.
తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి బుధవారం వరకు బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇవాళ మన్యం, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) వేగంగా విరిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలతో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి.
తెలంగాణలో 3 రోజులు వర్షాలు రాష్ట్రంలో నేటి నుంచి మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ నిజామాబాద్, సిరిసిల్ల, నల్గొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయంది. ఉరుములు, మెరుపులతో పాటు 30-40kmph వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
ఎండలతో అల్లాడిపోయిన తెలుగు రాష్ట్రాల జనాలకు వరుణుడు కాస్త రిలాక్సేషన్ ఇచ్చాడు. ఒక్కసారిగా కురుస్తున్న భారీ వర్షాలతో.. జనాలు రిలీఫ్ అవుతున్నారు.
దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఆదివారం భిన్నమైన వాతావరణం నెలకొంది. ఆరు జిల్లాల్లోని 15 మండలాలు ఎండల తీవ్రతతో వేడెక్కిపోయాయి.