Home » Tag » Titan submersible
టైటానిక్ నౌక శకలాల దగ్గరకు బయల్దేరిన టైటాన్ సబ్మెర్సిబుల్ ప్రయాణం మధ్యలోనే ఒత్తిడి పెరిగి పేలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురి ప్రాణాలు సముద్రంలో కలిసిపోయాయి. ఆ మినీ జలాంతర్గామి శకలాలు ఇప్పుడు తీరానికి చేరాయి. ఆ శకలాల్లో ఆసక్తికర విషయాలు గుర్తించారు అధికారులు.
తన పూర్వీకులు చనిపోయిన ప్రాంతాన్ని చూపించేందుకు స్టాంక్టన్ రష్ చాలా సార్లు తన భార్యను జలాంతర్గామిలో టైటానిక్ మునిగిన ప్రాంతానికి తీసుకువెళ్లాడట. కానీ రీసెంట్గా జరిగిన ప్రమాదంలో అనుకోకుండా స్టాంక్టన్ ప్రాణాలు కోల్పోయాడు.
ఒకవేళ జలాంతర్గామి పగిలిపోతే ఆ గాలి స్వయంచాలకంగా మారి జలాంతర్గామిని కాల్చేస్తుంది. అంటే ఈ స్థాయిలో విస్పోటనం జరిగితే సెకను కాలంలోనే అందులో ఉన్నవాళ్ల శరీరాలు కాలి బూడిదైపోతాయి. వీళ్ల విషయంలో కూడా అదే జరిగిందంటున్నారు అధికారులు.
ఎలాంటి సేఫ్టీ ప్రమాణాలు పాటించకుండా ఐదుగురు వ్యక్తుల ప్రాణాలు గాల్లో కలిపేశారంటూ ఓషియన్ గేట్ సంస్థపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నో సబ్మెరైన్లు తయారు చేసిన అనుభవం ఉన్న సంస్థ అయినప్పటికీ ఈ టైటాన్ సబ్మెర్సిబుల్ను మాత్రం ప్రయోగాత్మకంగా తయారు చేశారని అంటున్నారు.