Home » Tag » Titanic
టైటానిక్ సినిమాలో షిప్ కెప్టెన్ (Ship Captain) గా అద్భుతంగా నటించి అందరికీ గుర్తుండుపోయిన నటుడు బెర్నార్డ్ హిల్. ఆయన వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో తుది శ్వాస విడిచారు.
టైటానిక్ షిప్ మునిగిపోక మునుపు లోపల ఉన్న ఫర్నీచర్, ఇంటీరియర్, డ్రస్సింగ్ టేబుల్, లైటింగ్ చాలా అందంగా ఉండేవి. అదే పడవలోని ఇంటీరియర్ ప్రస్తుతం ఎలా మారిపోయిందో చూసేందుకు కొందరు పరిశోధకులు వాటిని ఫోటోలు తీయడం జరిగింది. ఆ అరుదైన అద్భుతమైన చిత్రాలు మీకోసం.
టైటానిక్ నౌక శకలాల దగ్గరకు బయల్దేరిన టైటాన్ సబ్మెర్సిబుల్ ప్రయాణం మధ్యలోనే ఒత్తిడి పెరిగి పేలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురి ప్రాణాలు సముద్రంలో కలిసిపోయాయి. ఆ మినీ జలాంతర్గామి శకలాలు ఇప్పుడు తీరానికి చేరాయి. ఆ శకలాల్లో ఆసక్తికర విషయాలు గుర్తించారు అధికారులు.
టైటానిక్.. ఈ పేరు సినిమా లవర్స్‌కు ఓ ఎమోషన్. ఇంగ్లీష్ సినిమా అయినా.. అన్ని భాషల ప్రేక్షకులు ఈ మూవీని ఓన్ చేసుకున్నారు . దాదాపు ప్రపంచంలోని అన్ని భాషల్లోకి వచ్చేసిందీ మూవీ.. దీనికితోడు అదే టైటానిక్‌ను చూడడానికి వెళ్లిన సబ్‌మెరైన్ కూడా ఈ మధ్యే మునిగిపోయింది.
ఎలాంటి సేఫ్టీ ప్రమాణాలు పాటించకుండా ఐదుగురు వ్యక్తుల ప్రాణాలు గాల్లో కలిపేశారంటూ ఓషియన్ గేట్ సంస్థపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నో సబ్మెరైన్లు తయారు చేసిన అనుభవం ఉన్న సంస్థ అయినప్పటికీ ఈ టైటాన్ సబ్మెర్సిబుల్ను మాత్రం ప్రయోగాత్మకంగా తయారు చేశారని అంటున్నారు.
టైటానిక్‌ను చూసేందుకు సబ్‌మెరైన్‌లో వెళ్లిన ఐదుగురు బిలియనీర్ల కథ విషాదాంతమైంది. నీటి పీడనం ఒత్తిడికి సబ్‌మెరైన్ పేలిపోయింది. అందులో ఉన్న ఐదుగురు బిలియనీర్లు జలసమాధి అయిపోయారు.
టైటానిక్.. ప్రపంచం ఎప్పటికీ మర్చిపోలేని విషాద ప్రయాణం. వందలాది మందిని సముద్రగర్భంలో కలిపేసిన చేదు జ్ఞాపకం.. 111 సంవత్సరాల క్రితం సముద్రగర్భంలో జరిగిన ప్రమాదం ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు అదే టైటానిక్ మరో ప్రమాదానికి సాక్షిగా మారింది.