Home » Tag » TMC
తెలుగు రాష్ట్రాలకు మళ్ళీ వరద ముంపు పొంచి ఉంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఒక్క రోజులో రెండు లక్షల క్యూసెక్కుల వరద పెరిగింది. అటు గోదావరి వరద కూడా క్రమంగా పెరుగుతోంది. దీనితో లోతట్టు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం పునరావాస కేంద్రాలకు తరలిస్తుంది.
ప్రచారంలో ఒక ఇంటివద్దకు వెళ్లినప్పుడు అక్కడ ఉన్న ఓ యువతి చెంపపై ఖగేన్ ముర్ము ముద్దు పెట్టాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ ఘటనపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన మళ్లీ బీజేపీతోనే కలిసి నడిచేందుకు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. ఇది కాంగ్రెస్కు భారీ షాక్ అనే చెప్పాలి. తాజా పరిణామాలు చూస్తుంటే.. ఇండియా కూటమి.. ఎన్నికల నాటికి బలహీనంగా మారి, విచ్చిన్నమయ్యే అవకాశం ఉంది.
మమతా బెనర్జీపై కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి విమర్శలు గుప్పించారు. "జీ20 సదస్సులో భాగంగా రాష్ట్రపతి ఇచ్చిన విందుకు మమత హాజరుకాకపోయుంటే ఆకాశమేమీ ఊడి పడేది కాదుగా. ఆమె ఈ విందులో పాల్గొనేందుకు ఇంకేదైనా కారణం ఉందా..?" అంటూ చౌదరి ప్రశ్నించారు.
విపక్షాలకు ఉమ్మడి శత్రువు బీజేపీ. కమలం వాడకపోతే తాము వికసించలేమని ఆ పార్టీలకు తెలుసు. అందుకే బలవంతంగా అయినా చేతులు కలిపాయి. అయితే కూటమిలోని కొన్ని పార్టీలది కక్కలేని, మింగలేని పరిస్థితి. పైగా పోరాటానికి సిద్ధమని చెబుతున్నా అది ఎక్కడ తమ కొంప ముంచుతుందోనన్న టెన్షన్ ఉంది.
ఎన్డీయేకు నాయకుడు ప్రధాని నరేంద్రమోదీ. అందులో ఏం అనుమానం లేదు. మిగిలిన వారంతా తెరవెనుక తంత్రం నడిపే సేనానులే. కానీ మరి ఇండియా కూటమికి నాయకుడు ఎవరు..? మోదీని ఢీకొట్టే ఫేస్ ఏది..? ఆ కూటమి మనుగడనే ప్రశ్నించే అతి పెద్ద ప్రశ్న ఇది.
ప్రతిపక్షాలను కలిపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే, బీజేపీ కూడా మిత్రపక్షాలకు ఆహ్వానం పలుకుతోంది. మంగళవారం ఎన్డీయే కూటమి సమావేశం నిర్వహించబోతుంది. అయితే, ప్రతిపక్షాల కూటమి సమావేశం కూడా అదే రోజు జరుగుతుండటం విశేషం.
దేశంలో రాజకీయ పార్టీల మధ్య ఆధిపత్య పోరు సరికొత్త సంస్కృతులకు తెరలేపుతోంది. కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీ ఆదేశాలను వ్యతిరేకిస్తూ ప్రాంతీయ పార్టీలు తమదైన శైలిలో ఆటంకాలు కలిగిస్తున్నాయి.
ఒకప్పుడు కాంగ్రెస్కు మద్దతిచ్చిన పార్టీలు నెమ్మదిగా పక్కకు తప్పుకొన్నాయి. దీంతో కాంగ్రెస్ అటు సొంతంగా ఎదగలేక.. ఇటు మిత్రపక్షాల మద్దతు లేక చతికిలపడిపోయింది. అయితే, ఇప్పుడు కర్ణాటక ఫలితాలతో కాంగ్రెస్ పార్టీలో జోష్ కనిపిస్తోంది. తిరిగి గత వైభవాన్ని సాధిస్తుందా అనిపిస్తోంది.
ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు కాంగ్రెస్ పార్టీ లేకుండా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యమనే నమ్మకం కావచ్చేమో..! విపక్షాలు మూడో కూటమి పేరుతో ఎగిరెగిరి పడుతున్నా కాంగ్రెస్ మాత్రం కిమ్మనడం లేదు.