Home » Tag » tour
టీమిండియా కొత్త కోచ్ గా గౌతమ్ గంభీర్ మొదటి సిరీస్ శ్రీలంక టూర్ నుంచే ప్రారంభం కాబోతోంది. అయితే ఈ పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టుపై విమర్శలు వస్తున్నాయి.
ప్రధాని మోదీ (PM Modi) లక్ష్యద్వీప్ (Lakshadweep) పర్యటన తర్వాత.. బ్యాన్ మాల్దీవ్స్ ( Ban Maldives) హ్యాష్‌ట్యాగ్ (Hashtag) ట్రెండ్ అయింది. లక్ష్యద్వీప్ ప్రాముఖ్యత గురించి మోదీ వివరిస్తూ.. ఓ సోషల్ మీడియా పోస్ట్ చేయడం.. ఆ తర్వాత మోదీని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ.. జాత్యహంకార దాడులకు దిగుతూ.. మాల్దీవుల మంత్రులు కామెంట్ చేయడంతో మొదలైన రచ్చ.. ఆ తర్వాత అనుకోని మలుపులు తిరిగింది.
ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్‌లో రెండు రోజుల పాటు పర్యటించారు. ఆ ప్రాంతంలో 1,150 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మోడీ లక్షద్వీప్ పర్యటన వెనుక సీక్రెట్ ఎజెండా ఉందంటున్నారు.
మీరు ఎప్పుడైనా ఒకే వాహనంలో భూమి నుండి నేరుగా నీటి రవాణా సౌకర్య అనుభూతిని పొందారా.. అసలు అలాంటి వాహనం ను ఎప్పుడైనా చూశారా.. అయితే ఇప్పుడు చూడబోతున్నారు.. వాహనం ఎక్కి విహరించబోతున్నారు.
సీఎం ఒక్క రోజు పర్యటన కోసం, ముప్పై ఏళ్ల వయసున్న చెట్లను నరికి, ప్రకృతిని నాశనం చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. హెలిప్యాడ్ వద్దే కాకుండా.. సీఎం పర్యటించే మార్గంలో కూడా అనేక చెట్లను రోడ్డకు ఇరువైపులా నరికేస్తున్నారు. స్థానిక జనసేన నేతలు ఈ చెట్ల నరికివేతను అడ్డుకున్నారు.
మనం సరదాగా ఎక్కడికైనా సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది ట్రైన్. రైలులో అయితే సీటింగ్ నుంచి వాష్ రూం వరకూ అన్ని సదుపాయాలు ఉంటాయి. పైగా తినేందుకు అవసరమైన ఫుడ్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ వాళ్లే సమకూరుస్తారు. మనం చేయవలసిందల్లా ఒక్కటే ప్రయాణానికి తగిన ఏర్పాట్లను ముందస్తుగా చూసుకొని టికెట్ బుక్ చేసుకోవడం. అయితే రైలులో టికెట్ దొరకడం అంటే అంత సులువైన పనికాదు. అయితే కనిష్టంగా మూడు, గరిష్టంగా ఆరు నెలల ముందుగా రిజర్వేషన్ చేసుకోవాలి. ఇలా చేసుకోలేని వారికి తత్కాల్ అనే కోటా ద్వారా ప్రయాణ సదుపాయం కల్పిస్తుంది రైల్వే. ఇదంతా ఒక్కరు లేదా ఒక కుటుంబం ప్రయాణం చేయాలంటే చేయవల్సిన తంతు. అదే ఒక కోచ్ లేదా రైలు మొత్తం బుక్ చేసుకోవాలంటే ఏలా అనే సందేహం అందరిలో కలుగవచ్చు. ఈ సందేహాన్ని క్రింది సమాచారం ద్వారా నివృత్తి చేసుకుందాం.
విహారం అనగానే ప్రతి ఒక్కరిలో ఒక వింత అనుభూతి చోటు చేసుకుంటుంది. అక్కడి ప్రదేశం ఎలా ఉంటుందో.. సౌకర్యాలు ఉంటాయో లేదో.. ఉండేందుకు వసతులు ఏమేరకు దొరుకుతాయో.. ఆప్రాంతంలో ఫుడ్ ఏమి దొరుకుతుందో.. అక్కడి వాతావరణం ఎలా ఉంటుందో.. అని అక్కడకి వెళ్లి చూసేకంటే ముందే ఇన్ని ప్రశ్నలతో చిన్నపాటి ప్రశ్నాపత్రాన్ని మన మైండ్‌లో సేవ్ చేసుకుంటాం. వాటికి సమాధానాలు దొరికే వరకూ అన్వేషిస్తూనే ఉంటాం. అలా కాకుండా సెలబ్రిటీ స్థాయి సౌకర్యాలతో విహారయాత్ర పూర్తి చేసుకుంటే.. అబ్బ ఆ అనుభూతి ఊహకు అందడం లేదు. వర్ణించేందుకు పోలికలు తూగడంలేదు కదూ. అందుకే ఇలాంటి వింతైన భావనను మనకు కలిగించాలనే ఉద్దేశ్యంతో ఏపీ ప్రభుత్వం లోని టూరిజం శాఖ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటిస్తుండటం పొలిటికల్ వేడిని మరింత పెంచుతోంది. ఈ నేపథ్యంలో బలప్రదర్శనకు ఇటు కమలం.. అటు కారు.. సిద్ధమవుతున్నాయి. మోదీ సభను విజయవంతం చేసేందుకు కాషాయ పార్టీ రెడీ అవుతోంటే.. ఇదే రోజు సింగరేణి ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఆందోళనకు పిలుపునిచ్చింది.
అమ్మాయి అనగానే కొందరిలో అనిపించే భావన అందంగా ఉందా..? మరికొందరిలో అయితే అణుకువ కలిగి ఉందా..? అని అంటూ ఉంటారు. అలాంటి అమ్మాయి ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళాలంటే చాలా జాగ్రత్తలు సూచనలు తీసుకోవాల్సి వస్తుంది. అన్ని సక్రమంగా తీసుకున్నప్పటికీ వెళ్లే ప్రయాణంలో ఏవో ఒక అసౌకర్యం సమాజం కలిగిస్తుంది. ఆసమాజంలో పురుషులు, స్త్రీలు ఎవరైనా ఉండవచ్చు. తనకు కావల్సిన స్వేచ్ఛను ఎప్పుడూ ఆమెకు అందించదు. అలాంటి పరిస్థితుల నుంచి వచ్చిందే ఈ ఆన్ హర్ వే అనే స్టార్టప్ సంస్థ. ఏమిటి ఆ సంస్థ ప్రత్యేకత అని మీలో సందేశం కలుగవచ్చు. మహిళలు తమకు ఇష్టం వచ్చినట్లు ఎక్కడికైనా తిరిగేలా ప్రణాళికలు రచించి పూర్తి బాధ్యత తీసుకుంటారు. వారికి నచ్చిన విధంగా విహారయాత్రలో అనుభూతిని కలిగిస్తారు. ఇది ఎలా సాధ్యమో ఇందులో చెప్పిన విషయాలు చదివితే ఒక అవగాహన వస్తుంది.