Home » Tag » traffic
నగరంలో ఇకపై హెల్మెట్ తప్పనిసరి చేసారు హైదరాబాద్ పోలీసులు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే కఠిన చర్యలు అంటూ హెచ్చరించారు. నేటి నుంచే కఠినంగా నిబంధనలు అమలు చేయనున్న పోలీసులు... నేటి నుంచి స్పెషల్ డ్రైవ్ లు ఏర్పాటు చేసారు.
తెలంగాణలో కొత్త ట్రాఫిక్ రూల్స్ అమలులోకి వస్తున్నాయి. ఇటీవల కాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో దాదాపు రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేస్తున్న కేసులే ఎక్కువగా వచ్చాయాని.. రాంగ్ సైడ్ వల్లే మరణాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు నిర్ధారించారు.
హైదరాబాద్ లో ఏప్రిల్ 23 మంగళవారం నేడు వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉండనున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా సిటీలో కొన్ని మార్గాల్లో ట్రాఫిక్ డైవెర్షన్ లు ఉంటాయని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
సంక్రాంతి (Sankranti) పండక్కి హైదరాబాద్‌లో చాలా మంది సొంతూర్లకు వెళ్లడంతో భారీగా ట్రాఫిక్ (Traffic Police) తగ్గింది. చాలా ప్రాంతాల్లో రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్ (Jubilee Hills), బంజారాహిల్స్, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, కొండాపూర్ ప్రాంతాలు చిన్నపాటి లాక్డౌన్ (Lock Don) డేస్‌ను గుర్తు చేశాయి.
హైదరాబాద్ నగర నడిబొడ్డున మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పంజాగుట్ట ఎర్రమంజిల్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం ఓ భవనంలోని నాలుగో అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. కాగా ఈ ఘటన సమయంలో అందులో నివసిస్తున్న కొంత మంది ప్రాణ భయంతో బయటికి వచ్చి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
తన కాన్వాయ్ కోసం నార్మల్ ట్రాఫిక్ ఆపొద్దంటూ సీఎం రేవంత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నార్మల్ ట్రాఫిక్‌లోనే తన కాన్వాయ్‌ని కూడా పంపించాలని.. సిగ్నల్స్ వస్తే ఖచ్చితంగా ఆపాలంటూ చెప్పారు. నిజంగా ఇది ఆదర్శవంతమైన నిర్ణయం.
నేడు తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడబోతుంది. తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా మాజీ ఎంపీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ నగర ప్రజలకు డీజీపీ రవిగుప్తా తెలిపారు.
సిగ్నల్ ఫ్రీ సిటీ లక్ష్యంగా ఇప్పటి వరకు "SRDP పథకం" కింద సిటీలో 33 ఫ్లైఓవర్లు అందుబాటులోకి వచ్చాయి. SRDP పథకంలో 36వ ప్రాజెక్టుగా ఇందిరా పార్క్ నుంచి VST వరకు నిర్మించిన "స్టీల్ బ్రిడ్జి" నగరవాసులకు రేపటి నుంచి అందుబాటులోకి రానుంది.
మెట్రో హైదరాబాద్ వాసులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. దీని రాకతో ప్రతి రోజూ వేల మంది అనేక ప్రాంతాలకు ప్రయాణాలు సాగిస్తున్నారు. ఈ సేవలను మరింత విస్తరించే ఆలోచనలో ఉంది హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్దం చేసింది.
వివిధ సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వం మధ్య జరిగిన చర్చల ప్రకారం బెంగళూరులో సూపర్ టన్నెల్ నిర్మించాలని ప్రతిపాదించారు. అంటే నగరం నాలుగు దిక్కులు కలిపేలా ఈ టన్నెల్ నిర్మాణం సాగనుంది. ఇది అండర్‌గ్రౌండ్ టన్నెల్.