Home » Tag » Travis Head
వరల్డ్ క్రికెట్ లో ఆస్ట్రేలియా ఆటగాళ్ళ ప్రత్యర్థులను పొగడడం చాలా అరుదుగా చూస్తుంటాం... ఎంతో అద్భుతంగా ఆడితే తప్ప ప్రత్యర్థి ఆటగాడి గొప్పతనాన్ని అంగీకరించరు..గతంలో సచిన్ , గంగూలీ, ద్రావిడ్, లక్ష్మణ్ వంటి దిగ్గజాలు మాత్రం ఆసీస్ మాజీల ప్రశంసలు అందుకున్నారు.
గ్రౌండ్ లో హుందాగా ప్రవర్తించడం తమకు అలవాటు లేదని ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉంటారు.. అంపైర్ కు అతిగా అప్పీల్ చేయడం, ప్రత్యర్థి ఆటగాళ్ళను స్లెడ్జింగ్ చేయడం వంటి చర్యలతో వార్తల్లో నిలుస్తుంటారు.
ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ ట్రావిస్ హెడ్ టీమిండియాకు సెంచరీలతో హెడేక్ తెప్పిస్తున్నాడు. తాజాగా గబ్బా వేదికగా తన బ్యాట్ పవర్ ఏంటో మరోమారు చూపించాడు. తాజాగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. హెడ్ విధ్వంసానికి మ్యాచ్ కంగారూల వైపు మళ్లింది.
భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో సత్తాచాటుతున్న ఆసీస్ స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్‌కు ప్రమోషన్ దక్కనుంది. శ్రీలంక టూర్‌కు ఒకవేళ కమ్మిన్స్ దూరమైతే, కెప్టెన్సీ బాధ్యతలు హెడ్‌కు అప్పగించాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తున్నట్లు సమాచారం.
ఆస్ట్రేలియా టూర్ లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా తన సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. సహచర బౌలర్ల నుంచి సరైన సపోర్ట్ లేకున్నా... తాను ఒక్కడే తనదైన పేస్ తో ప్రత్యర్థి జట్టును కంగారుపెడుతున్నాడు. తొలి రెండు టెస్టుల్లో అదరగొట్టిన బుమ్రా ఇప్పుడు గబ్బాలోనూ సత్తా చాటాడు.
ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రావిస్ హెడ్ టీమిండియాకు తలనొప్పిలా తయారయ్యాడు. పెద్ద టోర్నీల్లో ఇప్పటికే పలుసార్లు భారత్ కు కొరకరాని కొయ్యలా మారిన హెడ్ తాజాగా సొంతగడ్డపైనా దుమ్మురేపుతున్నాడు. భారత్ అంటేనే చెలరేగిపోయే ఈ ఆసీస్ హిట్టర్ గబ్బా వేదికగా జరగుతున్న మూడు టెస్టులోనూ సెంచరీతో కదం తొక్కాడు.
స్లెడ్జింగ్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే కంగారూలకు హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ అదే రీతిలో సమాధానమిస్తున్నాడు. పింక్ బాల్ టెస్టులో ప్రస్తుతం సిరాజ్ హాట్ టాపిక్ గా మారాడు. 4 వికెట్లతో ఆసీస్ ను దెబ్బకొట్టిన మియా భాయ్ ఆసీస్ బ్యాటర్లను పలుమార్లు కవ్వించాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ లో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది.
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు ట్రావిడ్ హెడ్ మరోసారి తండ్రయ్యాడు. అతడి భార్య జెస్సికా పండింటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.
ఐపీఎల్ ఫైనల్ ఫైట్‌కు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఓవైపు భీకర ఫామ్‌లో ఉన్న కోల్‌కతా, మరోవైపు సంచలన విజయాలతో ఫైనల్ చేరిన హైదరాబాద్ మధ్య హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది.