Home » Tag » TSRTC
హైదరాబాద్‌లో మెట్రో లేని రూట్లలో ప్రతి 10 నిమిషాలకో బస్సు నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.
ఈ కల్యాణోత్సవాన్ని నేరుగా హాజరై, చూసే అవకాశం లేని భక్తులు ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చు. కళ్యాణ తలంబ్రాలు కావాలనుకునే భక్తులు దీనికోసం రాష్ట్రంలోని అన్ని టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి, ముందుగా వివరాలు నమోదు చేసుకోవాలి.
తాజాగా అందుబాటులోకి తెచ్చిన లహరి ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సుల్లో బెర్త్‌లపై 10 శాతం రాయితీ కల్పించనున్నట్లు టీఎస్ఆర్టీసీ వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఏప్రిల్ 30 వరకు డిస్కౌంట్ అమలులో ఉంటుంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. నేటి నుంచి మార్చి 19 వరకు పరీక్షలు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. 1,521 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
కొన్ని ప్రాంతాల్లో మగవాళ్లకు ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేసింది టీఎస్ఆర్టీసీ. ఇక అన్ని బస్సుల్లో దాదాపుగా మహిళా ప్రయాణికులే ఎక్కువగా ఉన్నా.. వాళ్లకు కూడా గొడవలు జరుగుతున్నాయి. ఇబ్బందికరంగా మారిన సీట్ల వ్యవహారాన్ని సెట్ చేసేందుకు టీఎస్ఆర్టీసీ సరికొత్త ప్లాన్ వేసింది.
ప్రతీ రోజూ సగటున 27 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని వినియోగించుకుంటున్నారని సజ్జనార్ వెల్లడించారు. అయితే, ఉచిత బస్సు ప్రయాణం వల్ల పురుషులు, దివ్యాంగులు, వృద్ధులకు ఇబ్బందుల ఎదురవుతున్నాయి.
తెలంగాణలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నాగోల్‌కు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి ఈ పథకానికి వ్యతిరకంగా పిటిషన్ దాఖలు చేశారు. బస్సులలో మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణం కల్పించడం వివక్ష కిందకు వస్తుందని పిటిషన్లో పేర్కొన్నారు.
ఉచిత బస్సు ప్రయాణాన్ని యూజ్ చేసుకునేందుకు.. మహిళలు తమ వెంట ఏదైనా ఒరిజినల్ ఐడీ ప్రూఫ్‌ను తీసుకురావాలని అధికారులు సూచించారు. ఐతే ఇప్పుడు ఇదే విషయంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. ట్విట్టర్ వేదికగా కొన్ని విషయాలు పంచుకున్నారు.
నిజానికి ఏపీకి ఎక్కువ బస్సులు నడపాల్సి ఉంది. కానీ, మహాలక్ష్మి పథకంతో మహిళలు గతంలోకంటే ఎక్కువగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. దీంతో తెలంగాణ మహిళా ప్రయాణికులకు ప్రాధాన్యం ఇచ్చిన ఆర్టీసీ.. తెలంగాణకే అధిక బస్సులు కేటాయించింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. దీంతో టిక్కెట్లు జారీ చేయడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లను ఉపసంహరించుకుంటున్నట్లు సజ్జనార్ వెల్లడించారు.