Home » Tag » ttd chairmen
తిరుమల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు మోహినీ రూరుడై భక్తులకు దర్శనమిచ్చారు. వేల సంఖ్యలో భక్తుల పాల్గొని స్వామి వారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు.
శ్రీవారికి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు స్వామివారు ఉభయ దేవేరుతలో కలిసి మాడవీధులలో సంచరించారు. పెద్దశేష వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. కోనేటి రాయుని బ్రహ్మోత్సవాలు చూసేందుకు తండోపతండాలుగా భక్తులు కదిలి వచ్చారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్పవాలలో భాగంగా స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించేందుకు తిరుమల చేరుకున్న వైఎస్ జగన్. ఈ కార్యక్రమంలో టీడీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తోపాటూ మంత్రి రోజ పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం టీటీటీ కీలక నిర్ణయం తీసుకుంది. నడక మార్గంలో అడవికి ఇరువైపులా ఇనుప కంచెను ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తోంది.
కర్రలు చేతికి ఇచ్చి ప్రాణాలు కాపాడుకోమంటున్న టీడీడీ
తిరుపతిలో కచ్చపి ఆడిటోరియంను ప్రారంభించిన టీటీడీ ఛైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి. కలెక్టర్ తోపాటూ పలువురు ఉన్నతాధికారులు పాల్గొని కళాకారులకు జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన శ్రీనివాసుని పరిణయోత్సవం అందరినీ ఆకట్టుకుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం అంటే పైరవీలు.. రకరకాల ప్రభావాలు..కుల సమీకరణాలు..రాజకీయ అవసరాలు.. వ్యాపార ఒప్పందాలు ఇది ప్రభుత్వం దృష్టిలో టిటిడి అంటే.
జగన్కు చెప్పేవారే లేరా లేక ఎవరు చెప్పినా వినరా..? వైసీపీ నేతలను కూడా తొలిచేస్తున్న ప్రశ్న ఇది. రాజకీయ విషయాల్లో అంటే ఓకే కానీ చివరకు దేవుడి విషయంలోనూ అదే నిర్లక్ష్యమా..? అదే మొండితనమా..? దేవుడు కూడా నా కంట్రోల్లోనే ఉండాలన్నది సరైనదేనా..? టీటీడీ పాలకమండలి నియామకం మరోసారి వివాదాస్పదమైంది.
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిని పాటిస్తూ టీటీడీ కి సహకరించవలసిందిగా పలు సూచనలు చేసింది.
గత రెండురోజుల క్రితం తిరుమలలో చోటు చేసుకున్న ఘటన యావత్ శ్రీవారి భక్తులకు కాస్త భయాన్ని కలిగించింది. దైవ దర్శనార్థం తిరుమల కాలినడక మార్గంలో వెళ్తున్న చిన్నరిని చిరుత చంపేయడం అందరినీ కలిచివేసింది. మరికొందరిలో తీవ్ర ఆందోళన వ్యక్తం అయింది. దీంతో టీటీడీ వెంటనే రంగంలోకి దిగి భద్రతా చర్యలు చేపట్టారు.