Home » Tag » Typhoon
టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచి సంబరాల్లో మునిగితేలుతున్న భారత క్రికెట్ జట్టుకు అనుకోని కష్టాలు వచ్చి పడ్డాయి. వెస్టిండీస్ లో తుపాను ముప్పు ఉండడంతో ఎయిర్ పోర్టును మూసేశారు.
ఉత్తర భారతంలో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రానున్న నాలుగైదు రోజుల్లోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది.
నైరుతి రుతుపవనాలు వచ్చే వరకు రాష్ట్రంలో వేడి, ఉక్కపోత కొనసాగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నేటి నుంచి జూన్ 3 వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
తుపాను ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండదని స్పష్టం చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రాన్ని శక్తిమంత మైన పసిఫిక్ తుపాను అతలాకుతలం చేసింది. ఈ తుపాను కారణంగా కాలిఫోర్నియా రాష్ట్రంలోని అనేక నగరాల్లో కుంభవృష్టి కురిసింది. ఈ వర్షాలకు నదులు పొంగి పొర్లుతుండటంతో వరదలు పోటెత్తాయి.
మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడుతో పాటు తెలంగాణపైనా కూడా తీవ్ర ప్రభావం చూపించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటం, గంటకు 100 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయడంతో.. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రైతులకు భారీగా నష్టం వాటిల్లింది. ఏపీలో 8 జిల్లాల్లోని 60 మండలాల్లో తుఫాన్ ప్రభావం కనిపించింది. చేతికి అందిన పంటలు వరదపాలవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు.
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీరానికి చేరింది. బాపట్ల జిల్లా వద్ద మీచౌంగ్ తుఫాన్ తీరం దాటింది. ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విస్తారంగా కురిసిన వర్షాలు,ఈదురు గాలులు, సుడిగాలులకు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుక్కొంటున్నారు. ఇప్పటికే భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయం కాగా ఇప్పుడిప్పుడే తుఫాను దిశ మార్చుకుంటూ తెలంగాణ, ఛత్తీస్ గఢ్ లలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీలో పొంచి ఉన్న తుఫాన్ ముప్పు.. ఆగ్నేయా బంగాళఖాతంలో ఏర్పటిన అల్పపీడనం..తీవ్ర మిచౌంగ్ తుఫాన్ గా ఆవర్తనం చెంది.. కోస్తా తీర ప్రాంతానికి దూసుకోస్తొంది. ఇక ఏపీకి మిచౌంగ్ తుఫాన్ ముప్పు పొంచి ఉండటంతో ఏపీ విపత్తుల సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మిచౌంగ్ తుఫాన్ ప్రభావం ఎక్కువగా.. కోస్తాలోని జిల్లాలపై కనిపిస్తోంది. ఈ క్రమంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజల్ని అప్రమత్తం చేసింది. ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.