Home » Tag » Uddav Thackeray
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేనకు...ఓటర్లు ఎందుకు షాకిచ్చారు ? హిందుత్వ అజెండా విషయంలో...బీజేపీ వైపే మొగ్గు చూపడానికి కారణాలేంటి ? బద్ద వ్యతిరేకి అయినా కాంగ్రెస్తో కలవడాన్ని శివసైనికులు జీర్ణించుకోలేకపోయారా ? సీఎం పదవే శివసేనను పతనం అయ్యేలా చేసిందా ?
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు దేశంలోని అన్ని పార్టీలు ఒకే తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. ఈమధ్య కాలంలోనే ఇండియా అనే పేరుతో కూటమికి నామకరణం చేశారు. ఇండియా అంటే ఇండియన్ నేషణల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్ అని అర్థం. రానున్న రోజుల్లో మహారాష్ట్రలో సమావేశం అయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరికీ అర్ధం కావు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ గతంలో శివసేన – షిండే వర్గాల మధ్య జరిగిన రాజకీయ పరిణామం అని చెప్పాలి. ఈ రాజకీయ చదరంగంలో ఏక్ నాథ్ షిండే బీజేపీతో చేతులు కలిపి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఈ సీటు కింద ఇప్పుడు ప్రకంపనలు ప్రభలే ఆస్కారం ఉందని ఆ రాష్ట్రానికి చెందిన ఒక ప్రాంతీయ పత్రిక ఈ కథనాన్ని ప్రచురించింది.