Home » Tag » UK
పురాణాల్లో రాక్షసులు ఎలా ఉంటారో పుస్తకాలు చదివితే ఐడియా వస్తుంది. సినిమాలు చూసినా క్లారిటీ వస్తుంది. కానీ, మనలా, మనతోపాటే తిరిగే రాక్షసులను ఎలా గుర్తుపట్టాలి? దశాబ్దాలుగా బ్రిటన్ ఇలాంటి రాక్షసులతోనే బిక్కుబిక్కుమంటోంది. మనలో ఒక్కరిగానే ఉంటారు.
కోహినూర్ వజ్రం వల్లే.. కింగ్ ఛార్లెస్‌కు ఇలా జరిగిందంటూ.. డైమండ్ చరిత్రను గుర్తుచేసుకుంటున్నారు. కోహినూర్ డైమండ్ ధరించిన వాళ్లందరూ.. దారుణమైన స్థితిలో చనిపోయారు. ఆ వజ్రం దొరికినప్పటి నుంచి బ్రిటీష్ అధికారులు లూటీ చేసేంత వరకు ఇలాంటి సంఘటనలే కనిపించాయ్.
X మరోసారి డౌన్ అయింది సాంకేతిక సమస్యలతో గురువారం ఉదయం 11 గంటల టైమ్ లో ట్విట్టర్ సేవలకు అంతరాయం కలిగింది. ఒక్క యూఎస్ లోనే 77 వేల మందికి ఈ సమస్య తలెత్తినట్టు డౌన్ టిటెక్టర్ అనే సంస్థ తెలిపింది.
కరోనా ఒమిక్రాన్ వేరియెంట్‌కు సంబంధించి బీఏ 2.86 లేదా పిరోలా రూపం విజృంభించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఈ కోవిడ్ వేరియంట్ గత జూలైలో బ్రిటన్‌లో వ్యాపించింది.
(యూకే) బ్రిటన్‌కు చెందిన మార్క్ ఓవెన్ ఎవాన్స్ అనే వ్యక్తి తన కూతురు పేరు ను ఒంటిపై 667 సార్లు పచ్చబొట్టుగా వేయించుకొని వినూత్నంగా తన ప్రేమను చాటుకున్నాడు. 49 ఏళ్ల వయసున్న మార్క్ ఓవెన్ ఎవాన్స్ ఒకే పేరును తన శరీరంపై ఎక్కువసార్లు టాటూస్ రూపంలో వేయించుకుని ఏకైక వ్యక్తిగా ప్రపంచ రికార్డు కొల్లగొట్టాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఓవెన్ ఎవాన్స్ తన గిన్నిస్ రికార్డును తనే మరల బ్రేక్ చేశాడు అంటే నమ్ముతారా.. అవును తన గిన్నిస్ బుక్ రికార్డును తనే బ్రేక్ చేసుకున్న వ్యక్తిగా కూడా నిలిచాడు ఓవెన్ ఎవాన్స్.
బ్రిటన్‌లో ఆత్మహత్యల అంశంపై అక్కడి ప్రభుత్వం సీరియస్‌గా ఫోకస్ చేసింది. ఆత్మహత్యల్ని నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ చర్యలతో 2018 నుంచి సూసైడ్స్ సంఖ్య తగ్గుతూ వస్తోంది. అయితే, ఇంకా పూర్తిస్థాయిలో సూసైడ్ నివారణ చేపట్టాలని భావిస్తోంది.
జీ20 సదస్సు లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన బ్రిటన్ ప్రధాని. బ్రిటష్ ప్రధాన మంత్రి రిషి సునక్ న్యూ ఢిల్లీలో ఉన్న సమయంలో సందర్శనా కార్యక్రమాలు చేపట్టారు. ఆదివారం రిషి సునక్ దంపతులు అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించనున్నారు.
భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో అమెరికాలో అడుగుపెట్టిన ఆ యువతి చివరకు మానసికంగా, శారీరంగా కుంగికుశించుకుపోయింది. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. డాలర్ డ్రీమ్స్ తో అమెరికా ఫ్లైట్ ఎక్కి.. అక్కడ జీవితం ఊహించిన దానికి భిన్నంగా ఉండటంతో అనేకమంది ఎన్ఆర్ఐ విద్యార్థుల జీవితాలు నడిసంద్రంలో నావలా తయారయ్యాయి.
రిలయన్స్ అనే పదం పలికితేనే ఒక రకమైన వైబ్రేషన్స్ వెలువడుతాయి. ఇక ఆ కంపెనీ ఏదైనా బిజినెస్ లో అడుగుపెడితే సెన్సేషన్ అవుతుందని చెప్పాలి. పెట్రోల్, డీజల్, టెలికాం, ఎలక్ట్రానిక్స్, సూపర్ మార్కెట్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఓటీటీ ఇలా ఒక్కటా రెండా ప్రతి ఒక్క వ్యాపారంలో తనదైన బిజినెస్ స్ట్రాటజీతో దూసుకుపోతుంది. తన ప్రత్యర్థి వ్యాపారులకు వెన్నులో ఒణుకుపుట్టిస్తూ కస్టమర్లను తన వైపుకు తిప్పుకుంటుంది. ఈ సంస్థ అధినేత అంబానీ తాజాగా ఫార్మా రంగంలోకి అడుగుపెట్టేందుకు పావులు కదుపుతున్నారు.
మీ అకౌంట్లో లక్షన్నర రూపాయలు క్రెడిట్ అయినట్టు మెసేజ్ వస్తుంది. ఆ డబ్బులను మీరు ఎలాగైనా వాడుకోవచ్చు. ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు. మీ ఇంటి అవసరాలు తీర్చుకోవచ్చు.