Home » Tag » Under-19 World Cup
టీమిండియాకై (Team India) నా...అండర్-19 (Under 19) కైనా...మహిళల క్రికెట్ (Women's Cricket) జట్టుకైనా...ఫైనల్ ఫీవర్ ఉందా ? సెమీస్ దాకా రెచ్చిపోయే ప్లేయర్లు...ఫైనల్ పోరులో చేతులెత్తేస్తున్నారా? సీనియర్లైనా...జూనియర్లయినా...ఫైనల్ ప్రెజర్‌ను తట్టుకోలేకపోతున్నారా? మొదట బ్యాటింగ్ చేసినా...సెకండ్ బ్యాటింగ్ చేసినా...కొంతకాలంగా భారత్‌కు ఓటమి తప్పడం లేదు ఇటు బ్యాటర్లు...అటు బౌలర్లు...లాస్ట్ ఫైట్ లో తడబడుతున్నారు.
ఇషాన్ కిషన్.. టీమిండియా క్రికెటర్ పేరు సోషల్ మీడియాలో మళ్లీ మారుమోగిపోతోంది. ఎందుకంటే.. ఇంగ్లండ్‌తో జరిగే మిగతా మూడు టెస్టులకు ఇషాన్ పేరును పరిశీలించలేదు బీసీసీఐ. ఇంతకీ ఇషాన్ కిషన్‌కు ఏమైంది. కాల్ కూడా ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు. ఎవరి మీదో అలకను ఇంకొకరిపై చూపిస్తే.. కెరీర్‌పై ఎఫెక్ట్ పడదా అనే చర్చ నడుస్తోంది
అండర్ 19 ప్రపంచకప్ అంటేనే భారత్ డామినేషన్ కు కేరాఫ్ అడ్రస్... ఈ మెగా టోర్నీ నుంచే గతంలో ఎంతోమంది వెలుగులోకి వచ్చారు. కోహ్లీ, యువరాజ్, కైఫ్, రైనా, పంత్... ఇలా కుర్రాళ్ల కెరీర్ ను మార్చేసిన అండర్ 19 ప్రపంచకప్ లో ఈ సారి ఎవరు సత్తా చాటబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం భారత యువ జట్టు అద్భుతంగా రాణిస్తోంది. ఒక్క ఓటమి లేకుండా ఫైనల్లోకి అడుగుపెట్టిన యువ జట్టులో పలువురు ప్లేయర్స్ టైటిల్ పోరులో కీలకం కానున్నారు.
అండర్19 వరల్డ్ కప్ ఫైన (Under-19 World Cup Final) ల్ పోరుకు అంతా సిద్దమయింది. టైటిల్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ , ఆస్ట్రేలియా (Australia)తో తలపడబోతొంది. సీనియర్ జట్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు.. యువ కంగారూ జట్టును ఓడించి కప్పును ముద్దాడేందుకు భారత కుర్రాళ్లు సై అంటున్నారు.
కర్ణాటక మాజీ వికెట్ కీపర్ తిలక్ నాయుడు నేతృత్వంలోని భారత జూనియర్ సెలక్షన్ ప్యానెల్ ఈ జట్టును ఎంపిక చేసింది. ప్రస్తుతం దుబాయ్ వేదికగా జరుగుతున్న అండర్-19 ఆసియా కప్‌లో భారత్ జట్టుకు ఉదయ్ సహారన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.