Home » Tag » united states of kailasa
నిత్యానంద.. పేరు తెలియని వారు ఉండరు. వీడియోలతో ఒకసారి.. వ్యాఖ్యలతో మరోసారి.. దేశం విడిచి ఇంకోసారి.. వివాదాలకు కేరాఫ్‌గా మారిపోయాడు. అలాంటి నిత్యానంద పేరు ఇప్పుడు మళ్లీ చర్చకు వచ్చింది. నిత్యానంద దెబ్బకు ఓ మంత్రికి పదవి ఊడిపోయింది. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. నిత్యానంద స్థాపించిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసతో ఒప్పందం చేసుకోవడంతో.. పరాగ్వే మంత్రి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
నిత్యానంద పేరు ఇప్పుడు మళ్లీ మార్మోగుతోంది. ఐక్యరాజ్యసమితి తన ప్రతినిధులు పంపడం ద్వారా ఆయన మరోసారి హాట్ టాపిక్ గా మారారు. అయితే ఆయన వేషాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ చాట్ జీపీటీ కూడా పట్టేసింది.
నిత్యానంద కైలాస గురించి ప్రకటించగానే ఆయన మాటలను ఎద్దేవా చేశారు. జనాన్ని నమ్మించేందుకు ప్రగల్బాలు పలుకుతున్నాడని భావించారు. రిజర్వ్ బ్యాంక్, వీసాలు, పాలన.. లాంటి అంశాలను ప్రస్తావించినప్పుడు నిత్యానందకు పిచ్చి పట్టిందని నవ్వుకున్నారు. కానీ ఇప్పుడు నిత్యానంద కైలాస దేశం ఐక్యరాజ్యసమితి వరకూ వెళ్లింది. ఇదే ఇప్పుడు సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్న అంశం.