Home » Tag » Uttam Kumar Reddy
కాంగ్రెస్ ఇంతే.. కాంగ్రెస్లో ఇంతే అనే ఓ టాక్ ఉంటుంది ఎప్పుడు! హస్తం పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఆ పార్టీకి అదే బలం, అదే బలహీనత కూడా ! ఆ బలహీనతతోనే రాష్ట్రం ఇచ్చిన పార్టీగా తెలంగాణలో రెండుసార్లు అధికారానికి దూరం అయింది.
తెలంగాణ కేబినెట్ లో పదవుల పంచాయతీ నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలో ఇంకా ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడం కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది.
తెలంగాణలో 37 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ గుట్టు చప్పుడు కాకుండా లిస్ట్ రిలీజ్ చేసింది ప్రభుత్వం. అయితే అధికారిక ఉత్తర్వులు మాత్రం విడుదల కాలేదు. మార్చి 14న లిస్ట్ రిలీజ్ అయినా.. 16 రాత్రి వరకూ బయట పెట్టలేదు
కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, పలు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు బయల్దేరారు. అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. అందులో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలసి మేడిగడ్డ సందర్శనకు వెళ్తున్నారు.
సాగు నీటి విషయంలో బీఆర్ఎస్ (BRS) తెలంగాణ (Telangana) కు అన్యాయం చేసిందని అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అప్పటి రెండు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్.... అలయ్... బలయ్ చేసుకొని బిర్యాలు తిని... విందులు చేసుకొని ...ఆంధ్రాకు నీళ్ళను అప్పగించారని ఆరోపించారు ఉత్తమ్. రాష్ట్రంలో ఓడిపోతామని తెలిసే ఆంధ్రకు నీళ్ళు ఇచ్చారని మండిపడ్డారు.
తెలంగాణ (Telangana Government) ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పోలీస్ శాఖతో పాటు CMO, సెక్రటరియేట్ (Secretariat) లో ఉన్న BRS పార్టీ కోవర్టులను ఏరివేసే పనిలో ఉన్నారు. మొన్నటికి మొన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఒకేసారి 85 మందిని బదిలీ చేయడం వెనుక ఉన్న ఉద్దేశ్యం కూడా అదే. కానీ ఇప్పుడు నీటిపారుదల శాఖ (Irrigation Department) లో ఉన్న కట్టప్పలను గుర్తించలేక ఇరుకున పడుతున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణ కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. మేడిగడ్డ, కాళేశ్వరం నిర్మాణం తదితర కుంభకోణాలపై దర్యాప్తు చేయించడంలో కాంగ్రెస్ జాప్యం చేస్తోందని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణకు ఆదేశిస్తామనీ... ప్రజల డబ్బులతో మనం ప్రాజెక్టులను కడుతున్నాం..పూర్తిగా బాధ్యత యుతంగా, జవాబుదారీతనంతో పని చేయాలని అన్నారు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలోని సాగు నీటి ప్రాజెక్టు పురోగతిపై జలసౌధాలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇందులో ENC మురళీధర్ తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తిరుపతికి వెళ్తున్నారు. కుటుంబంతో కలిసి ఆయన తిరుపతి వెళ్తున్నట్టు చెప్పారు. మొక్కు తీర్చుకోడానికి ఆయన వెళ్తుంటే మరో వాదన మాత్రం బాగా వినిపిస్తోంది. తిరుపతి వెళ్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ గెడ్డం తీస్తారా లేదా అనే చర్చ జరుగుతోంది.
ఎయిర్ ఫోర్స్ లో పైలెట్ పని చేసి.. తర్వాత రాష్ట్రపతి భవన్ లో విధులు నిర్వహించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. దేశ సేవ నుంచి ప్రజాసేవ చేయాలన్న లక్ష్యంగా రాజకీయాల్లో అడుగుపెట్టాడు. గతంలోనూ మంత్రిగా పనిచేసిన ఉత్తమ్ కు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సర్కార్ లోనూ కేబినెట్ మినిస్టర్ ర్యాంక్ దక్కింది. 1962లో సూర్యాపేటలో జన్మించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. బీఎస్సీలో డిగ్రీ చేశారు. తర్వాత భారత వైమానిక దళంలో అడుగుపెట్టారు. పైలట్ గా దేశసేవ చేశారు. రాష్ట్రపతి భవన్ లోనూ పనిచేసే అవకాశం వచ్చింది.