Home » Tag » uttarandhra
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో గాజువాక నియోజకవర్గం హాట్ ఫేవరెట్. వైసీపీ, టీడీపీ అభ్యర్ధులు ఇద్దరికీ హోం గ్రౌండ్. ఒకరు మంత్రైతే... మరొకరు సీనియర్ నేత. అభివృద్ధి -సింపథీ-లోకల్ ఈ మూడు అంశాల చుట్టూ ఎన్నికలు తిరిగాయి.
జగన్ జోరు చూసి కిందిస్థాయిలో మంత్రులు ఎమ్మెల్యేలు చెలరేగిపోయారు. ఉత్తరాంధ్ర ఇంచార్జిగా వెళ్లిన ఎంపీ విజయసాయిరెడ్డి.. ఆ మూడు జిల్లాలని వణికించేశారు. సామాన్య ఉద్యోగులు, సాదాసీదా వ్యాపారులు కూడా భయపడి పోయే పరిస్థితి వచ్చింది.
ఉత్తరాంధ్ర టీడీపీకి కంచుకోట... అక్కడే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని గతంలో చెప్పుకునేవారు. కానీ 2019 నుంచి ఉత్తరాంధ్రలో టీడీపీ గ్రాఫ్ మెల్లగా తగ్గుతోంది. గతంలో వైసీపీ మొత్తం 34 అసెంబ్లీ స్థానాల్ 28 సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఫ్యాన్ గాలి బాగానే వీచింది.
తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. ఇప్పటికే గజగజా వణుకిపోతున్నారు ప్రజలు. రోజురోజుకు చలి తీవ్రత పెరిగిపోతునే ఉంది. మరో వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రమంతటా ఉదయం 9 గంటల వరకు మంచుతో కప్పి ఉంటుంది. రాత్రి ఉష్ణోగ్రతలే కాదు.. పగటి ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచే చలిగాలులు మొదలవుతున్నాయి.
తెలంగాణ ఎన్నికల వేడి ఏపీకి కూడా విస్తరించినట్లు కనిపిస్తోంది. ఒకరు నిజం గెలవాలి అంటూ బస్సు యాత్ర చేపడుతుంటే.. మరోకరు సామాజిక సాధికార యాత్ర పేరుతో బస్సు యాత్రలు చేపట్టనున్నారు. నిజం గెలుస్తుందా.. సామాజిక న్యాయం గెలుస్తుందా తెలియాలంటే ఈ స్టోరీ చూసేయాల్సిందే.
ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకూ రాజకీయ వేడి పెరిగిపోతుంది. ఒకవైపు పవన్ వారాహి యాత్ర.. మరోవైపు చంద్రబాబు పర్యటన ఈ రెండూ పాలకపక్షానికి తలనొప్పిగా మారాయి. ఇలాంటి తరుణంలో సొంత పార్టీ నేతల నుంచి తమ కుమారులకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని సీఎంవో కు అర్జీలు వస్తున్నాయి. ఇవి ఇప్పుడు వైపీపీ అధిష్టానానికి తలనొప్పి కాస్త తలబొప్పి కట్టే విధంగా మారింది.
చాలా చేశామని వైసీపీ చెప్పుకుంటున్నా.. చేయాల్సింది ఇంకేదో ఉందని ప్రజలు తీర్పు చెప్పారు. ఇన్నాళ్లూ వైసీపీ నేల విడిచి సాము చేసిందని ఇప్పుడు తేలింది. మరి ఇప్పుడైనా వైసీపీ మేల్కొంటుందా.. లేకుంటే సజ్జల చెప్పినట్లు వాళ్లు ఓటర్లు వేరే ఉన్నారని సర్ది చెప్పుకుంటారా..?