Home » Tag » UTTARPRADESH
ఇసుకేస్తే రాలనంత జనం! ఇంచు కూడా కనిపించని త్రివేణి తీరం! పాపాల్ని కడిగేసి.. మోక్షాన్నిచ్చే పవిత్ర సంగమ ప్రదేశం! 144 ఏళ్లకోసారి వచ్చే మహా వైభవం! ఈ భూమి మీద జరిగే.. అత్యంత గొప్ప ఆధ్యాత్మిక ఉత్సవం..
ప్రపంచంలోని అతిపెద్ద హిందూ సమ్మేళనం మహాకుంభమేళా.. సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. అంచనాలకు మించి భక్త జనం కుంభమేళాకు తరలి వస్తోంది. ఈ ఉత్సవం ముగిసేలోపు 40 కోట్ల మంది భక్తులు వస్తారని నిర్వాహకులు అంచనా వేసారు.
దేశంలో దాదాపు ప్రతీ ఒక్కరి ప్రయాణం ప్రయాగ్రాజ్ వైపే సాగుతోంది. జీవితాన్ని కష్టంగా ఫీలైన ప్రతీ ఒక్కరూ కుంభమేళా వైపే అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే కుంభమేళా త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పాపాలు పోతాయి అనేది ప్రతీ హిందువు నమ్మకం.
మౌనీ అమావాస్య సందర్భంగా జనవరి 29న 'అమృత స్నానం' ఆచరించేందుకు సుమారు 10 కోట్ల మంది భక్తులు హాజరవుతారని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది.