Home » Tag » Utter Pradesh
భారత యువ క్రికెటర్ , సిక్సర్ల వీరుడు రింకూ సింగ్ కు అరుదైన అవకాశం దక్కింది. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో రింకూ ఉత్తరప్రదేశ్ జట్టుకు సారథిగా ఎంపికయ్యాడు.
కుంభమేళాకు సర్వం సిద్ధమైంది. ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. 2025 జనవరిలో జరగబోయే.. ఈ కుంభమేళాకు వచ్చిన వారికి మంచి అనుభూతిని కలిగించేలా... ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
ఉత్తర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఏపీ పర్యటనలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. తొలి సారిగా ఆంధ్రప్రదేశ్ కి వచ్చాను, దుర్గా మాత అంటే శక్తి మాతను దర్శనం చేసుకున్నానన్నారు.
అమ్మా లేదు...నాన్న లేడు...అక్కా చెల్లి...తమ్మి లేడు ఏక్ నిరంజన్ అనే పాట ఉంది. బంధాల్లేవ్... బంధుత్వాల్లేవ్... రక్తసంబంధం అంతకన్నా లేదు. ఇప్పుడంతా డబ్బు చుట్టే రిలేషన్లు నడుస్తున్నాయి. ప్రేమించిన వారికి అమ్మైనా...నాన్నైనా...తోడబుట్టిన వారైనా సరే...చంపేస్తున్నారు.
రజినీకాంత్ లాంటి సెలబ్రిటీలకూ ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. అయినా హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రం ఫాలోయింగ్ ను ఆపరు !! తాజాగా శనివారం ఉదయం 72 ఏళ్ళ రజినీకాంత్.. 52 ఏళ్ల వయసున్న ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాదాలకు గౌరవంగా నమస్కరించారు.
ఈమధ్య కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు కొత్త ట్రెండ్ గా మారాయి. పరీక్షలు సరిగా రాయలేదనో, మార్కులు సరిగా రావన్న అపనమ్మకంతోనో, ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవుతామన్న ముందస్తు భయంతోనో బలవన్మరణాలకు పాల్పడటం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అలా జరగలేదు సినిమా హీరోను తాను కూడా అనుకరించే క్రమంలో క్లాస్ రూం ఆవరణలో నుంచి క్రిందకు దూకేశాడు. దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పబ్జీ ఆడుతూ.. పరిచయం ప్రేమగా మారిందని చెప్తూ.. ఫ్యామిలీని వదిలి మరీ పాకిస్తాన్ నుంచి యూపీకి వచ్చిన సీమా.. హైదర్ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. మళ్లీ పాకిస్తాన్‌కు పోయేది లేదని అంటోంది.
కాలంలో గతానికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చేస్తుంది. అది టెక్నాలజీ పరంగానే కాదు. శాస్త్రపరంగానూ ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతం అవుతున్నాయి. వీటిని ఉపయోగించుకొని కొందరు వండర్స్ క్రియేట్ చేస్తుంటే.. మరికొందరు జండర్ మార్చుకొని షాక్ ఇస్తున్నారు. తాజాగా ఒక అమ్మాయి అబ్బాయిగా మారి ఒక యువతిని పెళ్లిచేసుకునేందుకు సిద్దమయ్యారు. షాకింగ్ గా అనిపిస్తున్న వీరి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఏ ముహూర్తాన రిలీజ్ అయిదో కానీ.. ఆదిపురుష్‌ను వరుస వివాదాలు వెంటాడుతున్నాయ్. రామాయణం అన్నారు.. హనుమంతుడికి సీటు అన్నారు.. ఆ తర్వాత సినిమా కథ అసలు రామాయణమే కాదు అన్నారు. అడ్డమైన డైలాగులు.. అర్థం లేని విజువల్స్‌తో రామాయణాన్ని వక్రీకరించి.. హిందువుల నమ్మకాలతో ఆడుకున్నారని.. డైరెక్టర్ ఓం రౌత్ మీద జనాలంతా భగ్గుమంటున్నారు.
లోక్‌సభ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. మరో ఏడాదిలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. 2014, 2019 విజయభేరిని కొనసాగిస్తూ హ్యాట్రిక్ విజయంపై భారతీయ జనతా పార్టీ కన్నేసింది. మరోసారి విజయంతో మూడోసారి దేశ ప్రధానిగా కొనసాగాలని మోదీ భావిస్తున్నారు. ఆయనకున్న వ్యక్తి గత చరిష్మా, బీజేపీ అమలు చేసే పోల్ స్ట్రాటజీతో విజయం తమ పార్టీనే వరిస్తుందని కమలనాథులు గంపెడు ఆశలతో ఉన్నారు.