Home » Tag » Varahi Yatra
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే రెండు దశల యాత్ర పూర్తి చేసుకుని, విశాఖలో మూడో దశ యాత్ర ప్రారంభించారు. యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. అయితే, తమ మిత్రపక్షంగా ఉన్న జనసేన ప్రజల్లోకి వెళ్తుంటే బీజేపీ నుంచి ఎలాంటి మద్దతూ కనిపించడం లేదు.
తాజా రాజకీయ పరిస్థితులు చూస్తుంటే ఈ యాత్ర రాజకీయంగా ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ యాత్రను అడ్డుకునేందుకు వైసీపీ శతవిధాలా ప్రయత్నిస్తోంటే.. ఎలాగైనా యాత్రను విజయవంతం చేసి తీరుతామని జనసైనికులు అంటున్నారు.
జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి విజయోత్సవ యాత్ర ఉత్తరాంధ్రలో అడుగు పెట్టకముందే రాజకీయ వేడి రగిలింది. పవన్‌ను అడ్డుకోవడానికి అధికార వైసీపీ పోలీసులను అడ్డుపెట్టుకుంటోంది. మమ్మల్ని ఎలా అడ్డుకుంటారో చూస్తామంటూ జనసైనికులు సవాల్ చేస్తున్నారు. దీంతో విశాఖలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది.
పవన్ కల్యాణ్ మతాల గురించి ప్రజలను రెచ్చగొడుతుంటే ఆయన ఫ్యాన్స్ కూడా లోలోపల తెగ బాధపడిపోతున్నారట. ఇలా ప్రతిరోజూ ఎవరో ఒక్కర్ని కెలుక్కుంటే కష్టమంటున్నారు.
ఇప్పటికే మొదటి దశ వారాహి యాత్ర విజయవంతమైన నేపథ్యంలో రెండో దశ యాత్రను ఆదివారం నుంచి ప్రారంభించనున్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ పర్యటనపై చర్చించి, తాజాగా షెడ్యూల్ విడుదల చేశారు.
ప్రస్తుతం నాలుగు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. ఏపీలో ఎన్నికలు సమీపించడంతో రూటూ మార్చాడు. ఎన్నికలు ముగిసేవరకూ షూటింగ్స్‌కు గ్యాప్ ఇవ్వాలని అనుకుని వారాహి యాత్ర మొదలు పెట్టారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి లోని తన పార్టీ కార్యాలయంలో చండీ యాగాన్ని నిర్వహించారు. యాగం పూర్తి చేసుకొని అమ్మవారి ఆశీర్వాదం బలంతో వారాహి రథంపై ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ముందుగా గోదావరి జిల్లాలో యాత్ర పూర్తి చేసుకొని తరువాత రాయలసీమ జిల్లాలో పర్యటించనున్నట్లు సమాచారం. అన్నవరం నుంచి గన్నవరం వరకూ తొలి విడత వారాహి యాత్ర ప్రారంభం కానుంది.