Home » Tag » Vemireddy Prabhakar Reddy
అనిల్ మంత్రి అయ్యాక.. ఇతర నేతలతో వ్యవహరించే తీరులో మార్పు వచ్చింది. ఎన్నికలకు ముందు ఏ చిన్న విషయమైనా వేమిరెడ్డితో చర్చించే అనిల్.. తర్వాత స్వతంత్రంగా వ్యవహరిస్తూ వచ్చారు. నెల్లూరు జిల్లాలో అనిల్ అనుచరుల అక్రమాలను ఆపేయాలని వేమిరెడ్డి చెబితే ఆయన నుంచి స్పందన రాలేదు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. నెల్లూరు జిల్లాలో వైసీకి కీలకంగా ఉన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి రిజైన్ చేశారు. ఆయన భార్య ప్రశాంతితో కలసి ఈనెల 23న టీడీపీలో చేరుతున్నారు. వైసీపీ సభ్యత్వానికి, జిల్లా అధ్యక్ష పదవికి కూడా వేమిరెడ్డి రాజీనామా చేశారు. అభిమానులు, కార్యకర్తలతో సమావేశం తరువాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు
ఇప్పటికే నెల్లూరు జిల్లాలో చాలామంది నేతలు వైసీపీకి గుడ్ బై కొట్టారు. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి కూడా వెళ్ళిపోతుండటంతో జిల్లా వైసీపీ కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. నెల్లూరు ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఆయన భార్య, టీటీడీ మెంబర్ ప్రశాంతి వైసీపీకి రిజైన్ చేస్తున్నారు.
రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) సామ దాన బేద దండోపాయలను ఉపయోగిస్తున్నారు. ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాల్లో వ్యూహాలు పన్నుతూనే ఉన్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉంది తెలిసిన ప్రతీ నాయకున్ని సెకండ్ ఒపీనియన్ లేకుండా మార్చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ (YCP) కంచుకోట నెల్లూరులో కూడా భారీ మార్పులు జరిగాయి. ఇక్కడ కీలక నేతగా నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయబోతున్నారు.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) దగ్గరపడుతున్నాయి. పక్క పార్టీల నుంచి... వివిధ వేదికల మీద పని చేసిన వారు టీడీపీ (TDP) లో చేరుతున్నారు. ఇలా చేరడం వల్ల పార్టీకి బలమేననే భావన కొంతమేర వస్తున్నా.. కొత్త వారి చేరికతో పార్టీలో ఉన్న వారికి నష్టం కలుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీన్ని బ్యాలెన్స్ చేసుకోకుంటే తిప్పలు తప్పవనే సొంత పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారట.
రాజ్యసభ ఎంపీ, నెల్లూరు వైసీపీలో కీలకనేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Chevireddy Baskar Reddy) పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిపోవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది. జగన్ కు అత్యంత సన్నిహితుడైన వేమిరెడ్డి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడని అందరూ ఆశ్చర్యపోతున్నారు. పరిస్థితి బాలేదని... నెల్లూరు జిల్లాలో సగానికి పైగా ఎమ్మెల్యేలను మార్చాలని వేమిరెడ్డి చేసిన విజ్ఞప్తిని సీఎం జగన్ పట్టించుకోలేదు.