Home » Tag » Venu Swamy
సినిమా పరిశ్రమ, రాజకీయాలు, వ్యాపారాలు, వ్యక్తిగత జీవితాలు... ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి వీటిలో ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టే ఛాన్స్ ఉండదు. సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కడ కుదిరితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా తనకు నచ్చిన విధంగా జ్యోతిష్యం చెప్పడం కామెంట్ చేయడం అనేది ఈయన స్టైల్.
ఇంటర్నెట్ అనేది ఓ వింత ప్రపంచం ఎప్పుడు ఎవరు ఎందుకు స్టార్స్ అవుతారో ఎవరూ ఊహించలేరు. ఎప్పుడు ఎవరి జీవితాలు ఎలా మారిపోతాయో ఎవరూ అంచనా వేయలేరు. అలా ఇప్పటి వరకూ చాలా మంది ఓవర్ నైట్‌లో స్టార్స్‌గా మారిపోయారు.
టీవీ 5 మూర్తి బెదిరింపులు తట్టుకోలేకపోతున్నామని.. తమకు చావే దిక్కు అని.. వేణుస్వామీ సతీసమేతంగా మీడియా ముందుకు వచ్చి తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వేణుస్వామి ఆరోపణపై భగ్గుమన్న టీవీ5 మూర్తి.. ఆయన మీద పోలీసు కంప్లైంట్ ఇచ్చారు.
వివాదస్పద జాతకాలతో పాపులర్ అయిన వేణు స్వామి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారట. బిగ్ బాస్ 8 లో కంటెస్టెంట్ గా ఆయనకు పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది.
సెలబ్రిటీల జాతకాలు చెప్పి ఫేమస్ అయిన వేణుస్వామి... ఇప్పుడు తన జాతకం చూపించుకోడానికి ఎవరి దగ్గరికైనా వెళ్ళాలేమో. BRS గెలుస్తుందనీ, IPL లో సనర్ రైజర్స్ ఓడిపోతుందనీ... ఏపీలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారం చేపడతాడనీ రకరకాలుగా జాతకాలు చెప్పి... అన్నింట్లో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. ఇంక జ్యోతిష్యం ఆపు నాయనా... అబద్దాలతో ఎన్నాళ్ళు బతుకుతావ్ అని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.
హీరోయిన్ల దరిద్రమో... వేణు స్వామి (Venu Swamy) అదృష్టమో గానీ... జ్యోతిష్యంలో ఎన్ని తప్పులు చెప్పినా... అయ్యో సారీ అని ఎన్ని సార్లు నాలుక మడతేసినా... ఇంకా వేణు స్వామి దగ్గరే పూజలు చేయించుకుంటున్నారు.
ఆ టైమ్‌కు అనిపించింది చెప్తారా.. లేదంటే ప్లాన్డ్ ప్రకారం చెప్తారో కానీ.. వేణుస్వామి (Venu Swamy) మాత్రం ఎప్పుడూ కాంట్రవర్సీకి కేరాఫ్ అవుతుంటారు.