Home » Tag » Vijaya Sai Reddy
జగన్ జోరు చూసి కిందిస్థాయిలో మంత్రులు ఎమ్మెల్యేలు చెలరేగిపోయారు. ఉత్తరాంధ్ర ఇంచార్జిగా వెళ్లిన ఎంపీ విజయసాయిరెడ్డి.. ఆ మూడు జిల్లాలని వణికించేశారు. సామాన్య ఉద్యోగులు, సాదాసీదా వ్యాపారులు కూడా భయపడి పోయే పరిస్థితి వచ్చింది.
టీడీపీ, వైసీపీ మధ్య నువ్వానేనా అన్నట్లు యుద్ధం జరుగుతున్న వేళ.. అలేఖ్యా రెడ్డి ఎవరి వైపు ఉంటారు.. ఎవరికి మద్దతిస్తారు అనే చర్చ జోరుగా సాగింది. ఐతే అలేఖ్యా రెడ్డి ఇన్‌స్టా పోస్ట్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పై సంచలన కామెంట్ చేసిన YCP రాజ్యసభ సభ్యులు ఎంపీ విజయ సాయి రెడ్డి. గత కొన్ని రోజులుగా ట్విట్టర్ వేదికగా పురంధేశ్వరి - విజయసాయి రెడ్డి మధ్య మాటల యూద్దం సాగుతుంది.'పురందేశ్వరి పై ఏకంగా ఓ సంస్థ అమ్మకం విషయంలో పురంధేశ్వరి ముడుపులు తీసుకున్నారని' విజయ్ సాయి రెడ్డి ఆరోపించారు.దీనిపై సీబీఐ విచారణకు సిద్ధమా అని 'X' ట్విటర్ వేదికగా ప్రశ్నించారు విజయ్ సాయి రెడ్డి.
ఏపీ రాజకీయాల్లో.. ఉత్తరాంధ్ర రాజకీయాలు పూర్తి డిఫరెంట్ అని అంటుంటారు. ఉమ్మడి శ్రీకాకుళం, ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలతో కూడిన ఈ ప్రాంతంలో మొదటి నుంచీ తెలుగుదేశం పార్టీదే పైచేయి. గత ఎన్నికల్లో మాత్రం వైఎస్ జగన్ హవాలో 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 మాత్రమే టీడీపీ దక్కించుకోగలిగింది.
ఇది ఎన్నికల సమయం. మరో ఏడాదిలోపే ఏపీలో ఎన్నికలొచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది డిసెంబరులోనే రావొచ్చంటున్నారు. ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే కార్యకర్తల సహకారం అవసరం. ఈ విషయంలో వైసీపీ వెనుకబడిపోయినట్లు కనిపిస్తోంది. కారణం.. కార్యకర్తల్ని పట్టించుకోకపోవడమే.
వైసీపీ ప్రతీ అడుగులు, ప్రతీ విజయంలో విజయసాయి కీలక పాత్ర పోషించారు అనడంలో ఎలాంటి అనుమానం లేదు.. ఉండకూడదు కూడా ! పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ కాకపోయినా.. రాజకీయ అనుభవం లేకపోయినా.. రాజకీయం తెలియకపోయినా.. వైసీపీని సక్సెస్ఫుల్ పార్టీగా నిలబెట్టడంలో విజయసాయిది కీలక పాత్ర. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయంలో సోషల్ మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తే.. దాన్ని నడిపించడంలో విజయసాయికి వందకు 150 మార్కులు పడ్డాయ్.
చంద్రబాబుకు వైసీపీ ఎంపీ విజయసాయి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఇదే ఇప్పుడు హాట్‌టాపిక్ అవుతోంది. చంద్రబాబు, లోకేశ్ పేరు చెప్తే చాలు.. ఇంతెత్తున ఎగురుతూ, తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టే విజయసాయి నుంచి ఇలాంటి విషెస్ రావడం కొత్త చర్చకు కారణం అవుతోంది.
స్వామి భక్తి చూపించేవారంటే.. ఏ నాయకుడికైనా ఇష్టమే ! జగన్ దానికి తీసిపోరు. అందుకే ఆయన దృష్టిలో పడడానికి.. ఆయన మెప్పు పొందడానికి.. తమ భుజాలను తట్టించుకోవడానికి.. వైసీపీలో నేతలు జారే మాటలు.. ఇంకాసేపు బీప్ వేస్తే బాగుండు అనిపిస్తుంటుంది. ఏదో చేయడం కంటే.. ఏదీ చేయకపోవడమే బెటర్ కొన్నిసార్లు ! ఈ లాజిక్ మిస్ అవుతున్నారిప్పుడా పది మంది నాయకులు.