Home » Tag » Vijaya Shanthi
పార్టీకి సంబంధించిన అన్ని కార్యకలాపాలు ఓ ముగ్గురి ద్వారానే జరుగుతున్నాయని.. ఇంకా మిగిలిన వారికి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదని అధిష్టానంతో తాడో పేడో తేల్చుకునేందుకు.. సీనియర్ నేత వివేక్ ఇంట్లో ఆ మధ్య కొంతమంది నేతలు సమావేశం అయ్యారు.
విజయశాంతి బీజేపీని వీడాలని దాదాపు నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే బీజేపీపై వరుసగా విమర్శలు చేస్తోంది. వచ్చే నెలలోనే ఆమె బీజేపీని వీడి, కాంగ్రెస్లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ అగ్ర నేతలతో రాములమ్మ చర్చలు జరుపుతోంది.
ఏపీకి చెందిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించడంపై విజయశాంతి అసంతృప్తి వ్యక్తం చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి రాకను నిరసిస్తూ ఆమె సభ నుంచి వెళ్లిపోయారు. అనంతరం తన అసంతృప్తిని వెళ్లగక్కుతూ ట్వీట్ చేశారు.
అధ్యక్షుడిగా బండి సంజయ్ మార్పు.. డీకే అరుణ నియామకం.. ఈటలకు ప్రచార సారథి పదవి.. బండివకి కేంద్ర మంత్రి పదవి అంటూ అనేక ప్రచారాలు తెరమీదకు వచ్చాయి. తీరా చూస్తే అవన్నీ వట్టివే అని బీజేపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. ఈ ప్రచారం వెనుక సీఎం కేసీఆర్ ఉన్నారని అంటున్నారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ భారీగా పడిపోయింది. ఒకవేళ అక్కడ పార్టీ గెలిచుంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో. కానీ, ఓడిపోవడంతో పార్టీ ఇమేజ్ దెబ్బతింది. పార్టీ శ్రేణులు నిరాశలో కూరుకుపోయాయి. దీంతో ఇప్పుడు తమ రాజకీయ భవిష్యత్ ఏంటా అని బీజేపీ నేతలు ఆలోచిస్తున్నారు.
విజయశాంతి తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.