Home » Tag » Vijayashanti
చాలా విషయాల్లో ఆమె అసలు ఎందుకు ఆవేశపడుతుందో.. దేనికి ఆవేశపడుతుందో కూడా జనానికి అర్థం కాదు. మొత్తం మీద దేశంలో అన్ని పార్టీలు తిరిగివచ్చేసిన ఒకప్పటి లేడీ.. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో విశ్రాంత జీవితం గడుపుతోంది.
పాత మిత్రులను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది.నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి కారణం బీజేపీ పెద్ద తప్పు చేసింది. ఉద్యమ నాయకురాలుగా, పార్లమెంట్ లో కొట్లాడిన తెలంగాణ నాయకురాలుగా ఉన్న నేను.. రాష్ట్రమే నాకు ముఖ్యమని 25 సంవత్సరాలు పనిచేశాను. కాంగ్రెస్ విడిచి బీజేపీ కి వెళ్ళడానికి కారణం ఇదే.. కేసీఆర్ అవినీతిపరుడిని లోపల వేసి చర్యలు తీసుకుంటామని ఉద్యమకారులకు బీజేపీ అధిష్టానం మాట ఇచ్చిన. కేసీఆర్ పై చర్యలు తీసుకుంటుందని నమ్మకంతో బీజేపీ పార్టీలో లో చేరాను.
తెలంగాణ ఉద్యమ (Telangana movement) నేత, సినీ నటి మాజీ ఎంపీ విజయశాంతి (Vijayashanti) బీజేపీ (BJP) నుంచి కాంగ్రెస్ లోకి చేరిన సంగతి తెలతిసిందే.. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగియడంతో కాంగ్రెస్ లో చేరిన తర్వాత టీ కాంగ్రెస్ లో సముచిత స్తానాన్ని కేటాయించింది.
సినిమాలకు ఫుల్స్టాప్ చెప్పి మరీ బీజేపీలో చేరారు. ఆ తర్వాత పార్టీ పెట్టారు. దాన్ని తీసుకెళ్లి బీఆర్ఎస్లో కలిపారు. గులాబీ పార్టీ నుంచి ఎంపీగా కూడా గెలిచారు. ఏం జరిగిందో ఏమో తెలియదు. మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. అక్కడ నుంచి బీజేపీలోకి జంప్ కొట్టారు. ఇప్పుడు బీజేపీ నుంచి మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు.
తెలంగాణలో ఎన్నికల (Telangana Elections) వేళ బీజేపీ (BJP) కి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత విజయశాంతి పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామాను కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ (BJP State President) అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) కి పంపారు. కొంతకాలంగా పార్టీలో ప్రాధాన్యత తగ్గిన కారణంగా విజయశాంతి పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం బీజేపీలో ఉన్న విజయశాంతికి.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. చాలాకాలంగా ఆమె పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారు. బీజేపీ అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. మరోవైపు స్టార్ క్యాంపెయినర్ జాబితాలోనూ రాములమ్మ పేరు లేకపోవడం కొత్త చర్చకు దారి తీసింది.
తెలంగాణ బీజేపీ నుంచి ఒక్కొక్కరు జారుకుంటున్నారు. ఇప్పటికే కీలక నేతలు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, జి.వివేక్ హస్తం పార్టీలోకి చేరారు. ఇంకా బీజేపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న విజయశాంతి కూడా కాంగ్రెస్ లోకి చేరతారని టాక్ నడుస్తోంది.
విజయశాంతి.. బీజేపీలో ఉన్నట్లే అనిపిస్తున్నారు కానీ ఉండరు అనే పేరు ఉంది. పార్టీ మీద చాలా రోజులుగా అసంతృప్తితో రగిలి పోతున్నారు ఆవిడ. ఐతే ఇప్పుడు పార్టీ జంప్ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం.. ఓ ట్వీట్.
సరిలేరు నీకెవ్వరు కథ విన్న తర్వాత నటించనని చెప్పలేకపోయిన లేడీ సూపర్‌స్టార్ 13 ఏళ్ల విరామం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రొఫెసర్ భారతి పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. సూపర్‌హిట్‌తో రీ ఎంట్రీ జరిగినా.. ఆఫర్స్ వెల్లువలా వస్తున్నా.. సైన్ చేయలేదు విజయశాంతి.
అసెంబ్లీ ఎన్నికలు వస్తుండటం, కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీకి దిగుతుండటాన్ని విజయశాంతి అడ్వాంటేజ్‌గా తీసుకోవాలని అనుకుంటున్నారని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. గెలుపును పక్కన పెట్టేసినా కామారెడ్డిలో కేసీఆర్‌కు పోటీ ఇవ్వాలంటే.. ఒక స్ధాయి ఉన్న నేత కావాలి.