Home » Tag » Vijayendra Prasad
యావత్ దేశ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్ మహేష్ బాబు – రాజమౌళి (Mahesh Babu–Rajamouli).
సినిమా బ్యాక్‌డ్రాప్, స్టోరీ, మహేష్ గెటప్.. వీటి గురించి ఎవరికి తోచిన విధంగా వారు చెప్పుకుంటున్నారు. అయితే ఈ సినిమా ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతోంది అనే విషయాన్ని మాత్రం క్లారిఫై చేశారు. ఇప్పుడు ఈ సినిమాలో మహేష్ లుక్ ఎలా ఉండబోతోంది అనే దాని గురించి తీవ్రంగా చర్చించుకుంటున్నారు నెటిజన్లు,
మహేష్ బాబు (Mahesh Babu) ఇటీవలే గుంటూరు కారం (Guntur Karam) తో తన సత్తా చాటాడు. టాక్ తో సంబంధం లేకుండా రికార్డు కలెక్షన్స్ ని సృష్టించాడు. దీంతో ఇప్పుడు అందరి చూపు రాజమౌళి తో చెయ్యబోయే నెక్స్ట్ మూవీ మీద పడింది. దీంతో ఆ మూవీకి సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా నిమిషాల్లో వైరల్ గా మారుతుంది.
సూపర్ స్టార్ (Super Star) మహేశ్ బాబు (Mahesh Babu) - దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ SSMB 29 (SSMB29).. గుంటూరు కారం (Guntur Karam) తర్వాత మహేష్ బాబు- ట్రిపుల్ ఆర్ (RRR) తర్వాత జక్కన్న చేస్తున్న ఈ మూవీపై భారీ హైప్ ఏర్పడింది. భారీ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కనున్న ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎస్ఎస్ఎంబీ 29 (SSMB 29) గురించి ఓ రేంజ్లో చర్చ జరుగుతోంది. రీసెంట్గా విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిందని చెప్పడం.. మహేష్ బాబు (Mahesh Babu) జర్మనీ (Germany) కి వెళ్లడంతో రోజుకో న్యూస్ హల్చల్ చేస్తోంది.
తన తండ్రి, రైటర్ విజయేంద్ర ప్రసాద్ వల్ల మాత్రం జక్కన్నకి తలనొప్పులు తప్పట్లేదు. రీసెంట్గా ఒక ఇంటర్వూలో త్రిబుల్ ఆర్‌లో చరణ్ పాత్రని పొగిడి, తారక్ పాత్రని గెస్ట్ రోల్ వరకే పరిమితమైందనటం, మ్యాన్ ఆఫ్ మాసెస్ తారక్ ఫ్యాన్స్‌కి నచ్చలేదు.
తెలుగులో స్టార్ హీరోలలో (Telugu Star Heroes) మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి స్నేహితులు.. వీరిద్దరూ హీరోలుగా.. జక్కన్న (SS Rajamouli) డైరెక్షన్లో వచ్చిన ప్యాన్ ఇండియా (Pan India) మూవీ ట్రిపుల్ ఆర్ (RRR) తీశారు.
రాజమౌళి కోసం ఏళ్లకి ఏళ్లు కాల్ షీట్స్ వదులుకున్నా, కెరీర్‌కి నష్టం లేదనే అభిప్రాయం దేశవ్యాప్తంగా హీరోల్లో ఉంది. రాజమౌళి కూడా తనకు బెండ్ అయ్యే హీరోలతోనే పనిచేస్తాడనే అభిప్రాయం ఉంది. ఎందుకంటే తన మేకింగ్‌లో సినిమాలు తీస్తే హీరోల తలరాతలు మారిపోతాయి.
ఏప్రిల్‌లో ప్రెస్‌మీట్ పెట్టి కథ, పాత్రలు, అలానే వర్కింగ్ టైటిల్ ఎనౌన్స్మెంట్ కూడా ఇవ్వబోతున్నాడు రాజమౌళి. రూ.1500 కోట్ల ఈ భారీ ప్రాజెక్ట్ ఆఫ్రికా అడవుల్లోని అద్భుతాల వేటలో ఉండే ఓ ఇండియన్ ప్రొఫెసర్ కథ అంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.
బాహుబలి సమయంలో ప్రభాస్, ట్రిపుల్ ఆర్ టైంలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌ను తనకు కావాల్సిన అవుట్ పుట్ వచ్చే వరకు వదల్లేదు జక్కన్న. అలాంటిది మహేష్ బాబును వదులుతాడా.. ఛాన్సే లేదు.