Home » Tag » Vinesh Phogat
కాస్తలో ఒలిపింక్స్ గోల్డ్ మెడల్ మిస్ఐన స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. దాదాపు 6 వేల ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థిని ఓడించి విజయకేతనం ఎగురవేశారు.
అందరి అంచనాలకు తగ్గట్టే హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఈ ఎన్నికల్లో అధికార బిజెపి వెనుకబడింది. జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ 90 స్థానాల్లో 48 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం సాధించింది.
వినేష్ ఫోగాట్ పై ఒలంపిక్స్ లో అనర్హత వేటు పడటం పట్ల ఇప్పుడు దేశ వ్యాప్తంగా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ అవమానంతో ఆమె సంచలన నిర్ణయం తీసుకుంది.
నిన్నటివరకు అసలు స్పందించని బీజేపీ సహా వివిధ రంగాల ప్రముఖులు ఒక్కొక్కరుగా రెజ్లర్లకు మద్దతిస్తున్నారు. రెజ్లర్లకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ మహిళా ఎంపీ ప్రీతమ్ ముండే (మహారాష్ట్ర) రెజ్లర్లకు మద్దతు తెలుపుతూ మాట్లాడారు.
సామాన్యులని ప్రలోభపెట్టే వేషాలు వేస్తే ఏదో ఒక రోజు ప్రజలు తరిమి తరిమి తంతారు. ఇదే విషయాన్ని మాజీ రెజ్లర్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత మహావీర్ పోగట్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. నిజాలను బయటకు రానివ్వకుండా రెజ్లర్ల పోరాటాన్ని అణిచివేయాలని చూస్తున్న బీజేపీ పెద్దలపై ఫైర్ అయ్యారు.
వాళ్లు.. దేశానికి పతకాల పంట పండించిన క్రీడాకారులు.. మూడు రంగుల జెండాను ఎత్తుకుని గర్వంగా నిలబడ్డ వాళ్లు.. చుట్టూ ఉన్న ప్రేక్షకులంతా చప్పట్లు కొడుతుంటే.. అవి తమకు మాత్రమే కాదు.. మొత్తం భారత దేశానికి అని భావించిన వాళ్లు. పతకాలతో దేశం తిరిగొస్తే.. అభిమానులతో ఘన స్వాగతం అందుకున్న వాళ్లు.. ఇదంతా గతం..! ఇంత కీర్తి అందుకుని, కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచిన క్రీడాకారులు ఇప్పుడు ఇదే దేశంలో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అధికార బలానికి, పోలీసుల కాఠిన్యానికి బలవుతున్నారు.
దేశంలో ఇంతటి హోద అనుభవిస్తున్న క్రికెటర్లకు సాటి క్రీడాకారుల బాధల పట్ల కానీ.. సమస్యల పట్ల కానీ కనీసం బాధ్యత లేదా? స్టార్ రెజ్లల్ వినేశ్ పోగట్ వ్యాఖ్యల ఆంతర్యం ఇదేనా..?