Home » Tag » visa
భారతీయులు రష్యా గుడ్ న్యూస్ చెప్పింది. ఇక వీసా అవసరం లేకుండానే ఇండియన్స్ రష్యాలో పర్యటించవచ్చు. 2025లో ఈ నూతన విధానం అమల్లోకి రానుంది. రష్యాలో పర్యటిస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతుండడంతో అక్కడి ప్రభుత్వం ‘వీసా ఫ్రీ’ సౌకరాన్ని కలిగించనుంది.
అమెరికాలో చదివితే గొప్పగా రాణించగలమన్న నమ్మకం ఇప్పుడు చాలా మందిలో పెరిగిపోయింది. దశాబ్దకాలంగా ప్రతిఒక్కరూ అగ్రరాజ్యానికి పయనమౌతూ వస్తున్నారు. కరోనా సమయంలో దీనికి కొంత బ్రేక్ పడింది. ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవడంతో క్రమక్రమంగా వలస వెళ్లే సంఖ్య పెరుగుతూ వస్తుంది. తాజాగా USA చేసిన ప్రకటనతో దీనకి మరింత ప్రాధాన్యం సంతరించుకుంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా చదువుకోవాలనుకుంటున్న వారికైతే సువర్ణావకాశంగా చెప్పాలి.
అమెరికాలో విద్యను అభ్యసించాలనే కోరిక చాలా మంది విద్యార్థుల్లో ఉంటుంది. కానీ అక్కడి రూల్స్ చూస్తే ఒక అడుగు వెనక్కు వేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆపరిస్థితులను చెరిపేస్తూ నూతన మార్గదర్శకాలను జారీ చేసింది అగ్రరాజ్యం అమెరికా. స్టూడెంట్ వీసా కోసం సంవత్సరం ముందుగా దరఖాస్తు చేసుకునేలా వెసులుబాటు కల్పించింది. విసా ఇంటర్వూ స్లాట్ డేట్స్ ను నాలుగు నెలల ముందు బుక్ చేసుకునేలా నిబంధనలను సవరించింది.