Home » Tag » Visakha
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఏవేవో మాట్లాడి జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.
68 ఏళ్ల సుదీర్ఘ బంధం నేటితో విడిపోయింది. 10 ఏళ్లు ఏపీ, తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు కేవలం తెలంగాణకు మాత్రమే రాజధాని.
ఏపీలో ఫలితాలకు ఇంకొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నెల 31న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ భేటీ కాబోతున్నారు.
జూన్ 4న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (AP Assembly), లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) ఫలితాలు రాబోతున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న దానిపై టెన్షన్ నడుస్తోంది.
అక్కడ పోటీలో ఉంది మాజీమంత్రి గంటా శ్రీనివాస్ (Ganta Srinivas)... పొలిటికల్ ఆక్టోపస్ (Political Octopus). అవకాశం దొరికితే అల్లుకుపోవడం ఆయన తత్వం. సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఎత్తులు తప్ప పల్లాలు ఎరుగని నేత. అలాంటి సీనియర్ ఈసారి ఎన్నికలు (AP Politics) కొత్త అనుభవాలను, గట్టి పోటీని ఎదుర్కున్నారు.
విశాఖ (Visakha) వన్ టౌన్... పేరుకి పాత నగరమే కానీ ఇక్కడ రాజకీయం మాత్రం రంగుల రాట్నం. ఎప్పటికప్పుడు మారిపోయే ఈక్వేషన్లు ఎవరికి ఎందుకు సెట్ అవుతాయో... ఎవరికి ఫిట్టింగ్ పెడతాయో అంచనా వేయడం కష్టం. పునర్విభజన తర్వాత విశాఖ దక్షిణంగా పేరు మార్చుకున్న ఈ నియోజకవర్గం గ్రేటర్ వైజాగ్‌కే ఆయువు పట్టు. సాంప్రదాయ రాజకీయాలు కనిపించినా... ఓటర్ల తీర్పు విలక్షణంగా వుంటుంది.
అభ్యర్థుల ఎంపికపై ముమ్మర కసరత్తు చేస్తున్న వైసీపీ… వరుస లిస్టులను విడుదల చేస్తోంది. లోకల్, క్యాస్ట్, కాంబినేషన్... ఇలా రకరకాల ఈక్వేషన్స్ తో వడపోతలు నడుస్తున్నాయి. సమన్వయకర్తల మార్పు జరుగుతోంది. ఈ క్రమంలోనే ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా మార్పులు జరిగాయి. సర్వేల ఆధారంగానే ముందు కొత్త నాయకత్వాన్ని ఎంపిక చేసినా... కొన్ని చోట్ల ఆశించిన స్థాయిలో పుంజు కోలేకపోయారన్న అభిప్రాయం అధిష్టానం పెద్దల్లో పెరుగుతోందట.
రోజుకో దుమారం.. పూటకో వివాదం.. ఇదీ విశాఖ ఎంపీగారి స్టయిల్. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడానికి రాజకీయాల్లోకి వస్తే ఇక్కడ ఊహించని ఎదురు దెబ్బలు తప్పడం లేదట. ఈ దిశగా జనసేనతో పెట్టుకున్న సున్నం ఇప్పుడు ఆ విశాఖ ఎంపీ MVV కి తలనొప్పిగా మారింది. అదే సమయంలో అధికారపార్టీ నేతపై గ్లాసు పార్టీ పోరాడుతుంటే.. సైకిల్ సేన సైలెంట్ అవ్వడం వెనుక కారణాలు ఆసక్తిగానే ఉన్నాయి. లక్ష్యం ఉమ్మడిది అయినప్పుడు ఎవరికి వారే అన్నట్టుగా TdP, జనసేన ఎందుకు వ్యవహరిస్తున్నాయి..?
జనసేన పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ ను వైజాగ్ పోలీసలు అరెస్ట్ చేశారు. విశాఖలోని నొవాటెల్ హెటల్ వద్ద ఆందోళన చేస్తున్న మనోహర్ ను, జనసేన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం సెక్షన్ 30 అమలులో ఉండటంతో.. జనసేన ధర్నాకు అనుమతి లేదని పోలీసులు చెప్పుకొచ్చారు.
విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంలో స్థానిక మత్స్యకారులు "విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రవేశద్వారం వద్ద మత్స్యకార నాయకుల" నిరసన తెలుపుతున్నారు. ఫిషింగ్ హార్బర్ గత 50 ఏండ్ల చరిత్రలోనే ఇలాంటి రోజు ఇంత వరకు రాలేదు అని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.