Home » Tag » Vivek Venkata Swamy
ఎన్నికల వేళ తెలంగాణలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నా్. అసంతృప్త నేతలంతా ఎవరి దారి వారు చూసుకంటున్నారు. ఇతర పార్టీల్లోకి జంప్ కొడుతున్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్తో కంపేర్ చేస్తే.. కాంగ్రెస్ పార్టీయే ఈ అసంతృప్తులను ఎక్కువగా ఆకర్షిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక అటు బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వివేక్ బీజేపీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. దీంతో తెలంగాణలో బీజేపీకి మరో గట్టి దెబ్బ తగిలినట్లు అయింది.
బీజేపీ మాజీ ఎంపీ V6 అధినేత వివేక్ వెంకటస్వామి బీజేపీ పార్టీకి రాజీనామా.. ఇక చెన్నూరు నుంచి వివేక్ కుమారుడు వంశీ ని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దింపి తాను తిరిగి మళ్లీ ఎంపీగా పోటీ చేయనున్నట్లు సమాచారం. కానీ కాంగ్రెస్ మాత్రం చెన్నూర్ నుంచి వివేక్ ను పోటీ దించాలని.. పార్టీ అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి కూడా ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. కుమారుడు వంశీ కి ఎంపీ టికెట్ ఇస్తామనట్లు సమాచారం.
నేడు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నేడు సెంట్రల్ ఎన్నికల కమిటీ సమావేశం జరుగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం ప్రారంభం కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందులో తెలంగాణ ఎన్నికల విషయంలో కొన్ని కీలక పరిణామాలు చేటు చేసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలను తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పటికే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్న వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఇదే టైంలో వివేక్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అనే న్యూస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. రీసెంట్గా బీజేపీ రిలీజ్ చేసిన ఫస్ట్ లిస్ట్‌లో రాజగోపాల్‌తో పాటు వివేక్‌కు కూడా టికెట్ కేటాయించలేదు.
పార్టీకి సంబంధించిన అన్ని కార్యకలాపాలు ఓ ముగ్గురి ద్వారానే జరుగుతున్నాయని.. ఇంకా మిగిలిన వారికి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదని అధిష్టానంతో తాడో పేడో తేల్చుకునేందుకు.. సీనియర్ నేత వివేక్ ఇంట్లో ఆ మధ్య కొంతమంది నేతలు సమావేశం అయ్యారు.
సక్సెస్ ఫుల్ మీడియా అధిపతిగా, వ్యాపారవేత్తగా.. అంతకుమించి సోనియాగాంధీ స్థాయి వారితో చనువు కలిగిన సీనియర్ పొలిటీషియన్ గా వివేక్ వెంకటస్వామికి తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరుంది. మాజీ కేంద్రమంత్రి గడ్డం వెంకటస్వామి కుమారుడు కావడం అతిపెద్ద ప్లస్ పాయింట్. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల రాజకీయాలపై వివేక్ కు పట్టు కూడా ఉంది. అందుకే ఆయన వస్తానంటే.. ఏ పార్టీ అయినా వెంటనే రెడ్ కార్పెట్ పరుస్తుంటుంది.