Home » Tag » Vizianagaram
ప్రజల్లో వ్యతిరేకత ఉందని నివేదికలు అందిన పలువురు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల్ని సైతం పక్కన బెట్టి.. నిర్ణయాలు తీసుకుంటోంది పార్టీ అధిష్టానం. పలు ఉమ్మడి జిల్లాల్లో భారీగా మార్పులు చేర్పులు జరిగాయి. ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక్కరు మినహా అందర్నీ మార్చేసింది.
విజయనగరం జిల్లా శృంగవరపుకోట వైసీపీ (YCP)లో విచిత్రమైన రాజకీయం జరుగుతోంది. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మధ్య వర్గ పోరు తారా స్థాయికి చేరింది. సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాలని ఎమ్మెల్సీ పట్టు పట్టినా... వైసీపీ అధిష్ఠానం పట్టించుకోకపోవడంతో రఘురాజు భార్య సుధారాణి (Sudharani), ఆయన అనుచరులు టీడీపీకి టచ్‌లోకి వెళ్ళారు. రఘురాజు వెరైటీగా తాను వైసీపీలో ఉంటూ... భార్యను, అనుచరుల్ని టీడీపీలోకి పంపే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇదెక్కడి విడ్డూరంరా.. బాబూ... అని నోళ్ళు నొక్కుకుంటున్నారు ఈ వ్యవహారం చూస్తున్నవారు.
జైలుకొచ్చే ఏ ఖైదీకి అయినా నాలుగు మంచి బుద్ధులు చెప్పి పంపాలి సిబ్బంది. అతడిలో మార్పు తెప్పించి.. బయట మంచి మార్గంలో బతకమని ప్రోత్సహించాలి. కానీ దొంగతనం మీద జైలుకొచ్చిన ఓ వ్యక్తి దగ్గరే డబ్బులు నొక్కేశారు ఏపీలోని రాజమండ్రి జైలు సిబ్బంది. ఖైదీ దగ్గరే డబ్బులు తీసుకోవడం ఇప్పుడు ఏపీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.
తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడేలా చేసిన విజయనగరం రైలు ప్రమాద ఘటనపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ ప్రమాదానికి సిగ్నలింగ్ వ్యవస్థ ఫెయిల్ అవ్వడం కారణమా.. లేక మానవ తప్పిదం ఉందా అనేది అంతుచిక్కని పరిస్థితి నెలకొంది.
విజయనగరం రైలు ప్రమాదం నేపథ్యంలో ఆ మార్గంలో వెళ్ళే ఎక్స్ ప్రెస్ సహా పలు ప్యాసింజర్ రైళ్లును రద్దు చేశారు రైల్వే ఉన్నతాధికారులు.
విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం తనను బాధించిందని.. ఒక రైలును మరో రైలు ఢీకొట్టిందని.. రెండూ ఒకే దిశలో నడుస్తున్నాయని.. ఈ భయంకరమైన ప్రమాదం కొన్ని స్పష్టమైన ప్రశ్నలకు దారి తీస్తుందంటూ ట్వీట్లో రాసుకొచ్చారు జగన్.
బాలాసోర్ ఘటన మరువకముందే.. విజయనగరం లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి 7 గంటల సమయంలో విశాఖ-పలాస ప్యాసింజర్‌ను విశాఖ-రాయగడ రైలు ఢీకొట్టడంతో 7 బోగీలు పట్టాలు తప్పి నుజ్జు నుజ్జు అయ్యాయి. విజయనగరం రైలు ప్రమాద ఘటన వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటన నేపథ్యంలో 24 రైళ్ల రద్దు.. 26 రైళ్ల దారి మళ్లింపు..
ఆంధ్రప్రదేశ్ లో విజయనగరం లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ నుంచి పలాస రైలు సాయంత్రం 5:45 గంటలకు విజయనగరం వైపు బయలుదేరింది. అదే ట్రాక్ పై వెనుక విశాఖ రాయగడ ప్యాసింజర్ 6 గంటలకు బయలుదేరుతుంది. ముందు వెల్లిన పలాస రైలుకు సిగ్నల్ సమస్య తలెత్తడంతో కంటకపల్లి నుంచి పలాస రైలు చాలా నెమ్మదిగా ట్రాక్ పై కదులుతుంది అని ప్రయాణికులు చెప్తున్నారు.
ఓవర్ హెడ్ కేబుల్ తెగిపోవటంతో, సిగ్నల్ లేకపోవడంతో రైలును పట్టాలపై నిలిపి ఉంచారు. పట్టాలపై ఆగి ఉన్న రైలును.. ఇదే సమయంలో వెనుక నుంచి వచ్చిన విశాఖపట్నం-రాయగడ ప్యాసింజర్ రైలు ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మరణించినట్లు తెలుస్తోంది.
విజయనగరం జిల్లా, మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో 561.88ఎకరాల్లో రూ.834 కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేంద్ర విద్య మరియు నైపుణ్యాభివృద్ధిశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్. బహిరంగ సభకు హాజరైన విద్యార్థులు, ప్రజలు.