Home » Tag » Vladimir Putin
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి రష్యా పర్యటనకు వెళ్తున్నారు. నేడు, రేపు (జులై 8-9) రెండు రోజుల రష్యాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ జూలై లో రష్యాలో పర్యటించనున్నారు. భారత్-రష్యాల మధ్య వార్షిక చర్చల కోసం భారత్ స్వతంత్ర వైఖరిని ప్రదర్శిస్తోంది. దీంతో ప్రధాని ఈ పర్యటనకు వెళ్లనున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు ప్రధాని ప్రయత్నిస్తారని తెలుస్తోంది.
రష్యా (Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ఈ వారంలో చైనాలో రెండు రోజుల పర్యటన చేయనున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది.
రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం (Ukraine vs Russia War) గత రెండు సంవత్సరాలుగు కొనసాగుతుంది. ఫిబ్రవరి 24 సమారు 3 గంటల సమయ్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) తూర్పు ఉక్రెయిన్ (Ukraine) లో అధికారికంగా సైనిక చర్యను ప్రకటించారు.
ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే అక్కడ పుతిన్ మరోసారి అధ్యక్ష పీఠం కైవసం చేసుకోవడం ఖాయంగా ఉంది. గతంలో ఒక్కరోజే ఎన్నికలు జరిగేవి. కానీ, ఇప్పుడు మూడు రోజులపాటు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పుతిన్ తొలిసారిగా 2000లో అధ్యక్ష పదవి చేపట్టారు.
పుతిన్ వైఖరిని విమర్శించినా, వ్యతిరేకించినా.. వాళ్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతకాల్సిందే. వారిపై ప్రభుత్వం తీవ్ర ఆంక్షలు విధిస్తుంది. తాజాగా గ్యారీ కాస్పరోవ్‌పై కూడా చైనా ప్రభుత్వం ఇదే చర్య తీసుకుంది. ఆయనను ఉగ్రవాదులు, అతివాదులు’ జాబితాలో చేర్చింది.
అణు ప్రయోగాలు, క్షిపణి ప్రయోగాలతో ఉత్తర కొరియా అనేక దేశాలకు సవాళ్లు విసురుతోంది. భారీగా ఆయుధాలు సమకూర్చుకుంది. ఇదే సమయంలో యుక్రెయిన్‌పై యుద్ధం వల్ల రష్యా చాలా వరకు ఆయుధాల్ని వినియోగించాల్సి వచ్చింది.
నిజానికి రష్యా–ఇండియా స్నేహమైనా.. అమెరికా–ఇండియా ఫ్రెండ్షిపైనా అవసరాలతో కూడుకున్నవే. ఇందులో ఏ డౌటూ లేదు. కానీ ఇటివలి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మోదీ–పుతిన్ మధ్య బంధం మునుపటిలా లేదనిపిస్తోంది.
ప్రైవేటు ఆర్మీ వాగ్నర్ గ్రూపు అధినేత ప్రిగోజిన్ మరణంపై రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రమాదం వెనక పుతిన్ హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పుతిన్ కనుసన్నల్లో పనిచేసే రష్యా సైన్యం.. ప్రిగోజిన్ ప్రయాణిస్తున్న ఫ్లైట్‌ను కూల్చివేసిందనే వార్త ప్రచారంలోకి వచ్చింది.
రానురాను పరిస్థితులెందుకో పుతిన్‌కు వ్యతిరేకంగా మారుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై దురాక్రమణ తర్వాత పశ్చిమ దేశాల ఆగ్రహానికి గురైన పుతిన్‌కు ప్రస్తుతం సొంత దేశంలోనే వ్యతిరేకత పెరుగుతోంది.