Home » Tag » WhatsApp
గుర్తు తెలియని ఫోన్ నంబర్ నుంచి వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు వచ్చిందా ? తెలిసిన వారే పంపి ఉంటారని భావిస్తున్నారా ? లేదంటే ఏదైనా ఇన్విటేషన్ కార్డు...మీ మొబైల్ కు వచ్చిందా ? తస్మాత్ జాగ్రత్త.
కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ పేరిట గుర్తుతెలియని దుండగులు ఫేక్ వాట్సాప్ అకౌంట్ ను ఓపెన్ చేసారు గుర్తు తెలియని దుండగులు.
యూజర్స్ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్ (Users' information is confidential) గా ఉంచడంలో నెంబర్ వన్‌గా ఉండే వాట్సాప్ భారీ యాక్షన్ తీసుకుంది. వాట్సాప్ (WhatsApp) నిబంధనలతో పాటు దేశ చట్టాలు మీరుతున్న 2 కోట్ల మంది యూజర్స్ అకౌంట్స్ బ్లాక్ చేసింది. ఈ మేరకు ఓ అధికారికి రిపోర్ట్‌ను కూడా రిలీజ్ చేసింది వాట్సాప్.
తెలంగాణ (Telangana)లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలనాలు బయటకొచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) టార్గెట్ గా అప్పటి BRS ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిఘా పెట్టింది.
ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉన్న ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ.. త్వరలోనే మరింత విస్తరించే అవకాశం ఉంది. ఇదే జరిగితే పెను ముప్పుగానే చూడాలి. అందుకే.. ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ వ్యతిరేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా.
సైబర్ మోసగాళ్ళు రోజు రోజుకీ తెలివిమీరుతున్నారు. టెక్నాలజీని (Technology) వాడుకుంటూ జనాన్ని బురిడీ కొట్టిస్తూ కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్ (Smart phone) వాడుతున్న ప్రతి ఒక్కరికీ వాట్సాప్ ఉంటుంది. ఈ వాట్సాప్ వినియోగదారులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. అందుకే అప్రమత్తంగా ఉండాలంటూ బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సలహా ఇస్తోంది.
ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారేమో అనే అనుమానం వస్తే.. వాట్సాప్‌లో వారి ప్రొఫైల్ ఓపెన్ చేయాలి. మీ కాంటాక్ట్ లిస్టులో వారి నెంబర్ సేవ్ అయి ఉండాలి. అప్పుడు వారి ప్రొఫైల్ మీకు కనిపించిందో.. మిమ్మల్ని బ్లాక్ చేయలేదని అర్థం. అదే ప్రొఫైల్ మీకు కనిపించడం లేదంటే వాళ్లు మిమ్మల్ని బ్లాక్ చేశారని అర్థం.
వాట్సాప్ ఈ యాప్ తెలియని వారు ఉండరు.. ఈ యాప్ లేని ఫోన్ ఉండదు.. ప్రపంచ వ్యాప్తంగా 2020 నాటికి రెండు బిలియన్ వాట్సాప్ వినియోగదారులు ఉన్నారు. వాట్సాప్ ని ఎంతలా వినియోగిస్తున్నారు అంటే.. ప్రతి రోజు 50 కోట్లకు పైగా ఫోటోలు, 1,000 కోట్లకు పైగా మెసేజ్ లు దీని ద్వారా షేర్ అవుతున్నట్లు వాట్సాప్ యజమాన్యం అంచనా వేసింది.
సోషల్ మీడియా.. ప్రపంచంలో ఎన్నో మీడియాలు ఉన్న వాటన్నిటి కన్నా సోషల్ మీడియా అనేది చాలా పెద్ద మొత్తంలో ఉంది. ఎంతా అంటే పని లేని వాడు ఉంటదేమో కానీ.. సోషల్ మీడియా లో అకౌంట్ లేని వ్యక్తి అనేవాడే లేడు. మరో విధంగా చెప్పాలంటే సోషల్ మీడియా వాడి పని. సోషల్ మీడియాతో ఎన్ని ప్రయోజనాలున్నాయో.. అంతకు మించి అనర్థాలు కూడా ఉన్నాయన్న విషయం తెలిసిందే. నిజానికి మూడు గంటల కంటే ఎక్కువ సమయం సోషల్ మీడియాలోనే ఉంటున్నారు.
తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న మరో క్రైమ్ డీప్ ఫేక్. ఆడియో, వీడియో సింథసిస్ ప్రక్రియ ద్వారా డీప్ ఫేక్ స్కాంకు పాల్పడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా డీప్ ఫేక్ టెక్నాలజీ పని చేస్తుంది. అంటే ఎదుటివాళ్లు నిజమే అని నమ్మగలిగే ఫేక్ టెక్నాలజీ ఇది.