Home » Tag » Wickets
బజ్‌బాల్ అంటూ విర్రవీగిన ఇంగ్లండ్ జట్టు (England Team) కు టీమిండియా (Team India) భయాన్ని పరిచయం చేసింది. గత కొంతకాలంగా ప్రత్యర్ధి జట్టుతో సంబంధం లేకుండా సంప్రాదాయ క్రికెట్ రూపురేఖలను మార్చేసిన ఇంగ్లీష్ జట్టు.. భారత్ ముందు మాత్రం తలవంచింది. తొలి మ్యాచ్‌లో గెలుపొంది మాటలతో ఓవరాక్షన్ చేసిన ఇంగ్లాండ్ ప్రత్యర్ధి ఎవరన్నది ఇంగ్లండ్ మర్చిపోయింది.
ఆసియా కప్ 2023 రేపటి నుంచి మొదలుకానుంది. ఈసారి ఆసియా కప్ వన్డే ఫార్మాట్లో జరగనుంది. అయితే వన్డే ఆసియాకప్‌లో భారత బౌలర్ల రికార్డు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. వన్డే ఆసియాకప్‌లో ఇప్పటివరకు ఒకే ఒక్క భారత బౌలర్ ఐదు వికెట్లు తీసిన ఘనత సాధించాడు.
ఆర్ సి బి జట్టు ఫాఫ్ డు ప్లెసిస్ కెప్టెన్సీలో, మరియు సంజయ్ బంగర్ పర్యవేక్షణలో కోచ్‌గా ఉంది. ఆట యొక్క క్రమాన్ని నిర్ణయించే విషయానికి వస్తే ఇద్దరికీ మంచి కెమిస్ట్రీ ఉంది. జట్టులో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా ఫాఫ్, కోహ్లీ ఉంటారని అంచనా. ఆర్ సి బి నేటి మ్యాచులో గెలిస్తే ఐదవ స్థానం నుండి 3 వ స్థానంలోకి వస్తుంది.
ఫాఫ్ డు ప్లెసిస్ నేతృత్వంలోని RCB నేటి మ్యాచ్‌లో నైట్ రైడర్స్‌ను ఓడించినట్లయితే మొదటి మూడు స్థానాల్లోకి ప్రవేశిస్తుంది. మూడు సార్లు IPL ఫైనలిస్టులుగా పేరున్న ఆర్ సి బి, ఈ సీజన్లో ఎనిమిది పాయింట్లతో, పట్టికలో ఐదవ స్థానంలో ఉన్నారు. బెంగళూరులోని ఇదే వేదికపై గతంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్ సి బి, రాజస్థాన్ రాయల్స్ ని ఏడు పరుగుల తేడాతో ఓడించింది.
ఛాలెంజర్స్ బలమైన బ్యాటింగ్ లైనప్‌ను కలిగి ఉంది, మరియు వారి సొంత గ్రౌండ్ ఐన బెంగళూరు వారికీ బాగా కలిసొచ్చే ప్రాంతం. మరోవైపు KKR బౌలర్లు అత్యుత్తమ ఫామ్‌లో లేరు, ఇది ఆల్రెడీ ఫామ్ లో ఉన్న ఆర్సీబీ బ్యాటర్లకు క్యాష్ చేసుకునే అవకాశం. టాస్ గెలిచిన తర్వాత మొదట ఫీల్డింగ్ ఎంచుకుంటే గెలుపు సులువుగా మారే అవకాశం ఉంటుంది. ఛేజింగ్ జట్టుకు గెలిచే అవకాశాలు ఎక్కువ అని క్రికెట్ వర్గం కోడై కూస్తుంది.
ఈరోజు జరగబోయే ఆర్ సిబి, కె కె ఆర్ మ్యాచులో కొన్ని ఫన్నీ ప్రెడిక్షన్స్ అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి. అందులో రన్ మెషిన్ విరాట్ కోహ్లీ, స్టార్ పేసర్ ఉమేష్ యాదవ్ కి మధ్య జరగబోయే స్పెల్ కూడా ఒకటి. ఓపెనర్ గా వస్తూ అదరగొడుతున్న కింగ్ కోహ్లీకి ఆదిలోనే చెక్ పెట్టే ఉదేశ్యంలో ఉంది కె కె ఆర్. అందుకు తగ్గట్టుగానే ఉమేష్ యాదవ్ ను అన్ని రకాల బంతుల్తో సిద్ధం చేస్తుంది.