Home » Tag » Women's Reservation Bill
‘‘ప్రస్తుత ఎంపీ స్థానాలకు 1971 నాటి జనగణన ప్రాతిపదిక. ఆ లెక్క ప్రకారం తెలంగాణకు 17, ఆంధ్రప్రదేశ్‌కు 25 లోక్‌సభ స్థానాలున్నాయి. 2026 నాటికి ఈ రెండు రాష్ట్రాలలో జనాభా సంఖ్య ఇప్పుడున్న దానికన్నా భారీగా తగ్గుతుంది.
సాయంత్రం జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 454 మంది సభ్యులు ఓటు వేశారు. వ్యతిరేకంగా రెండు ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఓటింగ్ సమయంలో సభలో 456 మంది ఉన్నారు. వీరిలో ఎంఐఎం ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీ, ఇంతియాజ్ జలీల్ మాత్రమే బిల్లును వ్యతిరేకించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుఎప్పటినుంచో పెండింగ్‌లో ఉంది. ఆదివారం జరిగిన పార్లమెంట్ అఖిలపక్ష సమావేశంలో కూడా దీనిపై చర్చ జరిగింది. దీనికి ఎన్డీయే పక్షాలతోపాటు, ఇండియా కూటమి పక్షాలు కూడా సానుకూలంగా స్పందించాయి.
ప్రధాని మోడీ ప్రభుత్వ పదవీకాలం కొన్నినెలల్లో ముగియనుంది. దీంతో ‘ఒకే దేశం- ఒకే ఎన్నికలు’ ప్రతిపాదనను ఇంకా ఎక్కువ రోజులు సాగదీయడం సరికాదని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. జమిలి ఎన్నికలపై క్లారిటీ వస్తే ఎన్డీయే కూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపిణీపైనా బీజేపీ నాయకత్వం ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంటుందని ఆ పార్టీ సీనియర్లు భావిస్తున్నారు.