Home » Tag » Wrestlers Protest
ఇంతకాలం నిరసనల్లో కీలకంగా ఉన్న సాక్షి మాలిక్ ఈ నిరసనల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించింది. అయితే, ఉన్నట్లుండి సాక్షి మాలిక్ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు మాత్రం తెలియలేదు.
ఇప్పటివరకు పెద్దగా స్పందించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తాజాగా రెజ్లర్లతో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని రెజ్లర్ భజరంగ్ పునియా వెల్లడించారు. శనివారం రాత్రి మంత్రి అమిత్ షాను కలిసినట్లు పునియా తెలిపారు.
మన్‌కీ బాత్ ద్వారా 130 కోట్ల దేశ ప్రజలకు మీ అభిప్రాయాలను వినిపిస్తూ ఉంటారు కదా.. ఈ ఒక్కసారి మీరు మా మాట కూడా ఆలకిస్తారని ఆశిస్తున్నాం. బహుశా మీకు , మీ పార్టీ నేతలకు ఈ విషయం చాలా చిన్నగా కనిపించవచ్చు.
నిన్నటివరకు అసలు స్పందించని బీజేపీ సహా వివిధ రంగాల ప్రముఖులు ఒక్కొక్కరుగా రెజ్లర్లకు మద్దతిస్తున్నారు. రెజ్లర్లకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ మహిళా ఎంపీ ప్రీతమ్ ముండే (మహారాష్ట్ర) రెజ్లర్లకు మద్దతు తెలుపుతూ మాట్లాడారు.
సామాన్యులని ప్రలోభపెట్టే వేషాలు వేస్తే ఏదో ఒక రోజు ప్రజలు తరిమి తరిమి తంతారు. ఇదే విషయాన్ని మాజీ రెజ్లర్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత మహావీర్ పోగట్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. నిజాలను బయటకు రానివ్వకుండా రెజ్లర్ల పోరాటాన్ని అణిచివేయాలని చూస్తున్న బీజేపీ పెద్దలపై ఫైర్ అయ్యారు.
వాళ్లు.. దేశానికి పతకాల పంట పండించిన క్రీడాకారులు.. మూడు రంగుల జెండాను ఎత్తుకుని గర్వంగా నిలబడ్డ వాళ్లు.. చుట్టూ ఉన్న ప్రేక్షకులంతా చప్పట్లు కొడుతుంటే.. అవి తమకు మాత్రమే కాదు.. మొత్తం భారత దేశానికి అని భావించిన వాళ్లు. పతకాలతో దేశం తిరిగొస్తే.. అభిమానులతో ఘన స్వాగతం అందుకున్న వాళ్లు.. ఇదంతా గతం..! ఇంత కీర్తి అందుకుని, కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచిన క్రీడాకారులు ఇప్పుడు ఇదే దేశంలో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అధికార బలానికి, పోలీసుల కాఠిన్యానికి బలవుతున్నారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగిక వేధింపులకు గురి చేశాడని పలువురు రెజ్లర్లు ఆరోపించారు. అతడిపై చర్యలు తీసుకోవాలని, అలాగే పదవి నుంచి తప్పించాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు.