Home » Tag » WTC
న్యూజిలాండ్‌తో ముంబై వేదికగా జరిగిన టెస్టులో టీమిండియా బ్యాటర్ రిషభ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 50 సిక్సర్ల మార్క్‌ను అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన రెండో భారత క్రికెటర్‌గా, ఓవరాల్‌గా మూడో ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-25 సీజన్ కు సంబంధించిన ఫైనల్ రేసు రసవత్తరంగా మారింది. టీమిండియా, ఆస్ట్రేలియా తొలి రెండు స్థానాల్లో ఉండడంతో వీటికే ఎక్కువ అవకాశాలున్నాయని అందరూ అంచనాకు వచ్చేశారు. కానీ బెంగళూరు టెస్ట్ ఓటమితో భారత్ స్థానం మారకున్నప్పటకీ... గెలుపు శాతం తగ్గింది.
టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. పుణే వేదికగా కివీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో అతను ఈ మైలురాయి అందుకున్నాడు.
టెస్ట్ ఫార్మాట్ లో నిలకడగా రాణిస్తున్నా ఇప్పటి వరకూ టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలుచుకోలేకపోయింది. రెండుసార్లు ఫైనల్ కు చేరినప్పటకీ రన్నరప్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్థానానికి చేరుకుంది. ఇప్పటి వరకూ భారత్ ఏడు మ్యాచ్‌లు ఆడి నాలుగు విజయాలు, రెండు ఓటమి, ఒక డ్రాతో 59.52 పాయింట్ల శాతంతో సెకెండ్ ప్లేస్‌లో నిలిచింది.