Home » Tag » wtc final
గత ఏడాది కాలంగా వరుస విజయాలు... ఫలితంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్.. ఇంకేముంది ఫైనల్ బెర్త్ ఖాయమే అన్న అంచనాలు..ఇది మొన్నటి వరకూ భారత్ జట్టు పరిస్థితి... కానీ ఒక సిరీస్ వ్యవధిలోనే సీన్ మొత్తం రివర్సయింది.
సొంతగడ్డపై భారత్ కు ఊహించని పరాజయం... బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ టీమిండియాకు షాకిచ్చింది. బ్యాటర్ల వైఫల్యంతో ఓటమి పాలైన భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగుతున్న గెలుపు శాతం తగ్గింది.
ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ విషయంలో రిటైర్మెంట్ మీద ఈ మధ్య పుకార్లు ఎక్కువయ్యాయి. మరీ ముఖ్యంగా వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత ఇది ఇంకా శృతి మించింది. త్వరలోనే రోహిత్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది.
చివరగా 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మాత్రం గెలుచుకుంది. అంతకుముందు వన్డే వరల్డ్ కప్.. దానికి ముందు టీ20 వరల్డ్ కప్ మాత్రం ఇండియాకు దక్కాయి. ఆ తర్వాత నుంచి ఐసీసీ ట్రోఫీల్లో వరుసగా ఓడిపోతూనే ఉంది.
ఐపీఎల్లో పులిలా.. టీమిండియా తరుఫున పిల్లిలా ఆడుతున్న ఇద్దరి ఆటగాళ్ల గురించి తెలుసు కదా? ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఆ ఇద్దరి ఆట చూసిన అభిమానులకు ఒళ్లు మండిపోతోంది.
ఓడిపోయాం..ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో చెత్తగా ఆడి ఇంటిముఖం పట్టాం! ఓటమికి కారణం ఎవరన్నదానిపై ఎవరి అభిప్రాయాలు వాళ్లకి ఉంటాయి కానీ.. చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేసి పరాజయానికి కారణం అవుతున్నది మాత్రం ఈ ఇద్దరే..!
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 296పరుగులకు ఆలౌటైంది. రహానే,శార్దూల్ థాకూర్ పుణ్యామా అని ఫాలో అన్ నుంచి గట్టెక్కింది. అటు రోహిత్,కోహ్లీ ఆటతీరుపై అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు.
సాధారణంగా అంతర్జాతీయ ఆటల్లో మొమెంటో, కప్, మెడల్ లాంటివి బహూకరించడం చూస్తూనే ఉంటాం. అలాంటిది వింతగా గదను బహూకరిస్తే ఎలా ఉంటుంది. అలాంటి వింత సాహసం చేసింది ఐసీసీ. ఈ గద వెనుక కథేంటో చూసేద్దాం పదండి.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు గాయపడ్డ కేఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేయడంపై టీమిండియా అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఇది కచ్చితంగా ఫ్రెండ్షిప్ కోటానేనని రోహిత్ శర్మపై ఫైర్ అవుతున్నారు.