Home » Tag » Yashasvi Jaiswal
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో మరోసారి భారత యువ క్రికెటర్లు దుమ్మురేపారు. బంగ్లాదేశ్ తో చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో రాణించిన యశస్వి జైస్వాల్ టాప్ 5లోకి దూసుకొచ్చాడు.
తొలి రోజు టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ బ్యాటర్లను భారత బౌలర్లు అడ్డుకున్నారు. స్పిన్ త్రయం అశ్విన్, కుల్దీప్ యాదవ్ చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 57.4 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది.
2016లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కోహ్లి 655 పరుగులు చేశాడు. ఎనిమిదేళ్ల తర్వాత జైస్వాల్ ఈ రికార్డును సమం చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్‌లో రెండు డబుల్ సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు సాధించిన జైస్వాల్ 655 పరుగులు చేశాడు.
557 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీష్ టీమ్.. జడేజా స్పిన్ దెబ్బకి కేవలం 122 పరుగులకే చాపచుట్టేసింది. ఒక రోజు మిగిలి ఉండగానే భారత్ విజయాన్ని అందుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో జడేజా సెంచరీతో పాటు మ్యాచ్‌లో మొత్తం 7 వికెట్లు పడగొట్టాడు.
భారత బౌలర్ల జోరుకు, జైస్వాల్ విధ్వంసకర సెంచరీ కూడా తోడవడంతో ఇప్పటికే భారీ ఆధిక్యం సాధించి మ్యాచ్‌ను శాసించే స్థితిలో నిలిచింది. మూడో రోజు లంచ్ తర్వాత భారత బౌలర్లు చెలరేగారు. వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ జోరుకు అడ్డుకట్ట వేశారు.
వరుసగా ఇన్‌స్వింగర్, ఔట్ స్వింగర్స్ విసురుతూ ఇంగ్లీష్ బ్యాటర్లను కన్ఫ్యూజ్ చేశాడు. సీనియర్ బ్యాటర్లు స్టోక్స్, రూట్, బెయిర్ స్టో కూడా బూమ్రా ట్రాప్‌లో చిక్కక తప్పలేదు. అసలు బూమ్రా విసురుతోంది బంతులేనా లేకపోతే బుల్లెట్లా అన్న రీతిలో ఈ పేసర్ బౌలింగ్ సాగింది.
రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఆరంభించిన భారత్.. ఆట ముగిసే సరికి వికెట్ కోల్పోకుండా, 28 పరుగులు చేసింది. దీంతో ఇండియాకు 171 పరుగుల ఆధిక్యం లభించింది. జైశ్వాల్ 15 పరుగులతో, రోహిత్ శర్మ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు.
రెండో రోజు ఆటలోనూ యశస్వీ జైస్వాల్ బ్యాటింగ్ హైలైట్‌గా నిలిచింది. జైశ్వాల్.. దూకుడుగా ఆడుతూ డబుల్ సెంచరీ సాధించాడు. షోయబ్ బషీర్ బౌలింగ్‌లో బౌండరీ, సిక్సర్ వరుసగా బాది ద్విశతకాన్ని అందుకున్నాడు.
రోహిత్, గిల్, అయ్యర్ త్వరగానే ఔటైనా.. జైశ్వాల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ రోహిత్‌తో కలిసి 40 పరుగులు, గిల్‌తో 49, శ్రేయాస్ అయ్యర్‌తో 90 పరుగులు, రజత్ పటిదార్‌తో 70 పరుగులు చేసి, కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు.
తొలి టెస్ట్, మొదటి రోజు భారత్ అదరగొట్టింది. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ డామినేట్ చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. బజ్‌బాల్ వ్యూహాన్ని అమలు చేస్తూ ధాటిగా ఆడింది. ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలే దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు.