Home » Tag » Yatra-2
ఎన్నో వాయిదాల తర్వాత వ్యూహం చిత్రం థియేటర్లలోకి వచ్చేసింది. సెన్సార్ ఇష్యూస్ కావడంతో పలు సార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకి వచ్చేసింది.ఏపీ రాజకీయాలపై రామ్ గోపాల్ వర్మ తీసిన ఈ సినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి ఎంటర్ కావాల్సిందే.
వైఎస్ జగన్ బయోపిక్ ఆధారంగా యాత్ర 2 సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫిబ్రవరి 8, గురువారం విడుదలైంది. దీంతో ఏపీలోని వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు యాత్ర 2 చూసేందుకు థియేటర్లకు వెళ్లిపోయారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (Andhra Pradesh Elections) దగ్గరపడుతున్న నేపథ్యంలో పొలిటికల్ సినిమాలు ఎక్కువయ్యాయి. ఇప్పటికే యాత్ర 2(Yatra 2), వ్యూహం సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. అయితే ఆర్జీవీ, జగన్ వ్యూహానికి లోకేష్ చెక్ పెట్టడం తో అది కోర్టులో విడుదలకు ఎదురుచూస్తున్న ఖైదీల మాదిరి బయటకు రావడానికి కష్టపడుతుంది. ఇక యాత్ర 2 తోనే తానూ అనుకున్న లక్ష్యం నెరవేర్చుకోవాలని చూస్తున్న జగన్ కు ఊహించని షాక్ ఇచ్చింది రాజధాని ఫైల్స్ మూవీ. తాజాగా రిలీజైన ట్రైలర్ ఏపీ రాజకీయాల్లో వేడిని రాజేసింది.
పవన్ కల్యాణ్ నటించిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా కూడా ఇప్పుడే రీరిలీజ్ అవుతోంది. అది కూడా యాత్ర2 మూవీ కంటే ఒక్కరోజు ముందు ఫిబ్రవరి 7 నాడు. దాంతో ఏ సినిమా హిట్టవుతుంది.. ఏది ఫట్టవుతుంది.
టీజర్లో హీరో జీవా వైయస్ జగన్ పాత్రలో చాలా బాగా నటించాడు. జగన్ బాడీ లాంగ్వేజ్‌ని అచ్చు గుద్దినట్లు దింపేశాడు. టీజర్ రిలీజ్ అయ్యాక చాలామంది జగన్ పాత్రలో జీవా పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడని కామెంట్స్ కూడా చేశారు.
సినిమా తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బయోపిక్ మీద సినిమాలు వస్తున్నాయి.. కాదు కాదు తీస్తున్నారు. ఎప్పుడో ఒక సారి రెండు, మూడు సంవత్సరాలకు ఒక సారి వచ్చే బయోపిక్స్ సినిమాలు ఇప్పుడు సంవత్సరంలో ఒకటైన తప్పక వస్తుంది. తప్పక తీస్తున్నారు అని చెప్పవచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా.. అయి అక్కడికే వస్తున్న. మన ఇప్పుడు చెప్పుకునేది ఓ ప్రముఖ వ్యక్తి బయోపిక్ గురించే.. అదే "యాత్ర"
తెలుగు సినిమా పరిశ్రమలో గత కొంత కాలంగా వరుస బయోపిక్స్ వస్తున్నాయి. పలువురు సినీ తారలతో పాటు క్రీడా, రాజకీయ ప్రముఖుల జీవిత కథల ఆధారంగా చిత్రాలు తెరకెక్కుతున్నాయి. వీటిలో చాలా బయోపిక్స్ మంచి విజయాలను అందుకున్నాయి. అలాంటి వాటిలో ‘యాత్ర‘ ఒకటి. ఆంద్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 ఎలక్షన్స్ ముందు విడుదల అయ్యింది.
ప్రస్తుతం ఎటు చూసినా రాజకీయల్లో యాత్రలు ఎక్కువయ్యాయి. అది బస్సు యాత్ర కావచ్చు, పాదయాత్ర కావచ్చు. వీటికి మన తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ సెట్ చేసింది మాత్రం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని చెప్పాలి. ఈయన పై యాత్ర పేరుతో ఒక బయోపిక్ కూడా వచ్చింది. పెద్ద ఎత్తున ప్రేక్షకుల మదిని దోచుకుంది. అయితే తాజాగా అతని కుమారుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేస్తూ యాత్ర - 2 ను సీక్వెల్‌గా తెరకెక్కిచనున్నట్లు తెలుస్తుంది.