Home » Tag » ycp mps
ఏపీలోని మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఫైళ్ళ కాల్చివేత వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది.
ఏపీలో అధికారంలో ఉన్నన్నాళ్ళూ... బీజేపీకి అంటకాగి... NDA ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు దూరమైనట్టేనా ? ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా తర్వాత బీజేపీతో తాడో పేడోకి రెడీ అయినట్టు అర్థమవుతోంది. గత మోడీ ప్రభుత్వ హయాంలో వైసీపీని వాడుకున్న బీజేపీ... ఏపీలో చంద్రబాబు, పవన్ దగ్గరవగానే వదిలేసింది.
ఏపీ మాజీ సీఎం జగన్ నేడు ఢిల్లీలో ధర్నా మొదలైంది. ఇందుకోసం నిన్నే హస్తినకు చేరుకున్న మాజీ సీఎం జగన్ ఇవాళ.. జంతర్ మంతర్లో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో నిరసన తెలుపుతున్నారు.
ఒకప్పుడు చంద్రబాబు మెథడ్ నే ఇప్పుడు జగన్ కూడా ఫాలో అవుతున్నారు. తమ రాజ్యసభ ఎంపీలను బీజేపీలోకి పంపాలని డిసైడ్ అయ్యారు. ఏడుగురు వైసీపీ రాజ్యసభ ఎంపీలు... ఢిల్లీ బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్ళారు. వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో వీళ్ళు బీజేపీలో చేరే అవకాశాలున్నాయి.
ఆంధ్రప్రదేశ్ వైసీపీలో ఎంపీల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. మార్పులు, చేర్పులతో కొంతమంది, అసలు అధికారంలేని పార్టీలో ఉంటే ఎంత... పోతే ఎంత అని కొందరు ఎంపీలు వైసీపీకి గుడ్ బై కొడుతున్నారు. జగన్ పార్టీలో డమ్మీ ఎంపీలుగా ఉండటం కంటే... వేరే పార్టీ నుంచి స్వతంత్ర్యంగా బతకొచ్చని భావిస్తున్నారు.