Home » Tag » Yogi Adithyanath
కుంభమేళాకు సర్వం సిద్ధమైంది. ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. 2025 జనవరిలో జరగబోయే.. ఈ కుంభమేళాకు వచ్చిన వారికి మంచి అనుభూతిని కలిగించేలా... ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ రోజు రోజుకూ రెచ్చిపోతోంది. మొన్నటి వరకూ తమ ప్రత్యర్థులను మాత్రమే టార్గెట్ చేసిన ఈ గ్యాంగ్ ఇప్పుడు తమ ఉనికిని చాటుకునేందుకు రాజకీయ నాయకులకు కూడా టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి సిద్ధిఖీ హత్యతో దేశవ్యాప్తంగా లారెన్స్ గ్యాంగ్ పేరు మార్మోగిపోతోంది.
ఉత్తర్‌ప్రదేశ్ పేరు చెప్తే ఫస్ట్ గుర్తొచ్చేది గ్యాంగ్స్, మాఫియా, డాన్స్. కానీ ఇది ఒకప్పుడు. ఇప్పుడు మాత్రం సీన్ వేరేగా ఉంది. మాఫియా పేరెత్తాలంటేనే అక్కడి డాన్స్ భయపడుతున్నారు. క్రైమ్ చేయాలంటే వెనకా ముందూ ఆలోచిస్తున్నారు. దీనికి కారణం ఒకే ఒక వ్యక్తి. ఆయనే యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్.
యూపీలో తుపాకీ శబ్దాలకు బ్రేక్‌లు కనిపించడం లేదు. ఉమేష్ పాల్ కేసుతో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరి అంతు చూస్తామని అసెంబ్లీ వేదికగా వార్నింగ్ ఇచ్చి మరీ.. ఒక్కొక్కరిని లేపేస్తున్నారు సీఎం యోగి. ఈ కేసులోనే అరెస్ట్ అయి జైలు నుంచి బయటకు వస్తున్న అతీక్ అహ్మద్‌పై కాల్పులు జరిపిన ఘటన.. ఇప్పటికీ కళ్లముందే తిరుగుతోంది అందరికీ ! మాఫియాను కూకటివేళ్లతో సహా పెకిలించి వేస్తామని పదేపదే చెప్తున్న యోగి.. మ్యాన్ ఆన్ యాక్షన్ అనిపిస్తున్నాడు.
గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతిఖ్ అహ్మద్ అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్‌లు దారుణహత్యతో.. ఉత్తరప్రదేశ్‌తో పాటు యావత్ దేశం ఉలిక్కిపడింది. అంతకు రెండు రోజుల ముందే అతిఖ్ కుమారుడు అసద్ , అనుచరుడు గుల్హామ్‌లు ఎన్కౌంటర్లో హతమైన నేపథ్యంలో అతిఖ్ కూడా హత్యకు గురయ్యారు.
స్టేట్‌లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతున్నాయంటే అక్కడ గ్యాంగ్స్టర్స్ ఎక్కువగా ఉన్నారని అర్థం. కానీ అదే గ్యాంగ్స్టర్స్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారంటే అక్కడ యోగి ఆధిత్యనాథ్ లాంటి సీఎం ఉన్నాడని అర్థం. చిన్నా పెద్దా తేడా లేకుడా ప్రతీ గ్యాంగ్‌స్టర్ షేప్ మార్చేస్తున్నారు యోగి. ఒకప్పుడు యూపీని షేక్ చేసిన అతీక్ అహ్మద్ అనే గ్యాంగ్‌స్టర్ ఇప్పుడు యోగి దెబ్బకు ప్రాణాలు కాపాడమని ప్రాధేయపడుతున్నాడు.