Home » Tag » Yogi Adityanath
నూతన పార్లమెంట్ లో మళ్లీ మొదలైన రాజదండ రగడ.. లోక్‌సభలో రాజ దండాన్ని స్పీకర్ చైర్ పక్కన గోడకు అమర్చటంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. రాజదండానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో రాజదండం స్థానంలో రాజ్యాంగ ప్రతిని అమర్చాలని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆర్కే చౌదరీ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
అయోధ్య రాముడిని (Ayodhya Ram) బీజేపీ (BJP) ఎంత హైప్ చేసింది. రామాలయం నిర్మాణం దగ్గర నుంచి విగ్రహ ప్రతిష్ట... అంతకంటే ముందు బీజేపీ నేతలు... ఇంటింటికీ అక్షింతలు పంచడం... ఫోటోలను అందించడం.... బీజేపీ లేకపోతే రాముడు లేడు అన్నంత బిల్డప్ ఇచ్చారు ఆ పార్టీ నేతలు.
తన ఆధ్యాత్మిక యాత్రను ముగించుకున్న రజనీకాంత్ యూపీ వెల్లి, అక్కడ యోగితో కలిసి జైలర్ మూవీ చూశాడు. ఆ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్‌కు పాదాభివందనం చేశారు. అంత పెద్ద సూపర్ స్టార్... ముఖ్యమంత్రి కాళ్లు తాకడమేంటని కొందరు విమర్శించారు.
రీసెంట్గా దుండగుల చేతిలో హతమైన గ్యాగ్‌స్టర్ అతీక్ అహ్మద్ అక్రమంగా ఆక్రమించిన ఓ ప్లేస్‌లో యోగీ ప్రభుత్వం అపార్ట్మెంట్ నిర్మించింది. ఆ అపార్ట్మెంట్లో మొత్తం 76 ఇళ్లు ఉంటాయి. ఆ ఇళ్లను పేదలకు పంచాలని యోగి సర్కార్ నిర్ణయించింది.
అతీక్ అహ్మద్‌ను ఎవరు చంపారు.... ఎందుకు చంపారు అన్నది వేరే స్టోరీ. అతడిని చంపడం, చంపించడం న్యాయమా అంటే అది వేరే కథ... కానీ నేరమంటే పులిమీద సాములాంటిది. దాని మీద నుంచి కిందకు దిగలేరు. దిగితే బతకనివ్వదు... ఇక్కడా అదే జరిగింది. నేరాన్నే చిరునామాగా మార్చుకున్న అతీక్... అదే నేరానికి బలైపోయాడు.
యోగి దృష్టిలో తప్పుచేసిన వారిని తక్షణమే శిక్షించడం తక్షణ న్యాయం. అందుకే యూపీలో అన్ని ఎన్కౌంటర్లు.. అన్ని జరగబట్టే జనం కాస్త బయటకు రాగలుగుతున్నారు. మొత్తంగా మాఫియా పాలిట అతిపెద్ద గూండారాజ్ యోగి ఆదిత్యనాథ్..
ఒకప్పుడు ఉత్తరప్రదేశ్‌లో పట్టపగలు కూడా ఆడవారు బయటకు రావాలంటే భయపడేవారు. ఎప్పుడు ఎవడు ఎత్తుకెళతాడో తెలిసేది కాదు. పోలీసోళ్ల పెళ్లాలకే దిక్కులేదు.. విక్రమార్కుడు సినిమాలో సీన్‌కు కాస్త అటూ ఇటుగానే సిట్యుయేషన్ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.