Home » Tag » Yogita Bihani
అనేక సినిమాలు కూడా నెల రోజుల్లోనే ఓటీటీలోకి వస్తున్నప్పటికీ.. ది కేరళ స్టోరీ మాత్రం ఓటీటీలో విడుదల కాలేదు. దీంతో ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వారందరికీ ఇప్పుడో గుడ్ న్యూస్. ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.
ప్రతి సినిమా పబ్లిసిటీకి కోట్లు ఖర్చుపెట్టక్కర్లేదు. సినిమా వివాదాస్పదం అయితే చాలు.. ఎవరో ఒక వర్గం ప్రేక్షకులు అండగా నిలిస్తే చాలు.. సినిమాలు విజయవంతం అవుతున్నాయి. మొన్న ది కాశ్మీర్ ఫైల్స్.. నిన్న పఠాన్.. నేడు ది కేరళ స్టోరీ. పెద్దగా ప్రచారం చేయకుండానే ఈ సినిమాలు వందల కోట్ల వసూళ్లు సాధించాయి.
సినిమా ఒక్కటే.. కానీ, దీనిపై పార్టీల అభిప్రాయాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. అవి కూడా తమ రాజకీయ ఉద్దేశాల ప్రకారమే సినిమా విషయంలో నిర్ణయం తీసుకున్నాయి. కొన్ని రాష్ట్రాలు సినిమాను నిషేధిస్తే.. మరికొన్ని రాష్ట్రాలు సినిమాకు పన్ను రాయితీలు కల్పిస్తున్నాయి.
కేరళ అనగానే గుర్తుకొచ్చేది ప్రకృతి అందాలు... బ్యాక్ వాటర్...మనసు దోచే సముద్రతీరం...కానీ భవిష్యత్తులో కేరళ ఉగ్రవాదుల రాజ్యంగా మారిపోబోతోందా ? ఇస్లామిక్ టెర్రరిస్టులకు అడ్డాగా చూడాల్సి వస్తుందా ? మత సామరస్యానికి నిలయంగా ఉండే గాడ్స్ ఓన్ కంట్రీ ఐసిస్ తీవ్రవాదానికి హెడ్ క్వార్టర్స్‌గా మారుతుందా ? ఈ ప్రశ్నలనే కథా వస్తువుగా తీసుకుని తెరకెక్కించిన THE KERALA STORY మూవీ విడుదలకు ముందే ప్రకంపనలు సృష్టిస్తోంది.
‘ది కాశ్మర్ ఫైల్స్’ చిత్రంలోలాగే ఇందులో కూడా కొన్ని వివాదాస్పద అంశాలున్నాయి. ఒక వర్గానికి వ్యతిరేకంగా కావాలనే ఈ చిత్రం తీశారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘ది కేరళ స్టోరీ’పై ఎందుకీ వివాదం?