Home » Tag » YS Avinash Reddy
పసుపు మూకలతో చెల్లెమ్మలు చేతులు కలపారు. ఇలాంటి కుట్రలు చేయడానికి చెల్లెళ్లను ఎవరు పంపించారో ప్రజలకు బాగా అర్థమైంది. పసుపు చీరలు కట్టుకొని వైఎస్ఆర్ శత్రువులతో చేతులు కలిపిన వారు వైఎస్ వారసులా..? నన్ను నేరుగా ఎదుర్కోలేక అంతా కలిసి ఒక్కసారి దాడి చేస్తున్నారు.
వివేకా హత్య కేసు రకరకాల మలుపు తీసుకుంటోంది. అవినాశ్ రెడ్డి అరెస్ట్ అవుతారా లేదా అనే ప్రశ్న చుట్టే తిరగుతోంది కేసు మొత్తం.
వివేకా కేసు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. సినిమాను మించిన ట్విస్టులు కనిపిస్తున్నాయ్ ఈ ఎపిసోడ్లో! సీబీఐ దర్యాప్తులో మైండ్ బ్లాంక్ అయ్యే సంచలన నిజాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయ్. వివేకా హత్య ఘటన గురించి ప్రపంచానికి తెలియడానికి ముందే.. జగన్‌కు సమాచారం అందిందని.. హైకోర్టులు అఫిడవిట్ దాఖలు చేసింది సీబీఐ. దీంతో వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది.
అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై రెండ్రోజులపాటు విచారణ జరిపిన హైకోర్టు తుది తీర్పును 31న వెల్లడిస్తామని చెప్పింది. అప్పటివరకూ అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయవద్దని ఆదేశించింది. దీంతో సీబీఐ మరోసారి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వివేకా హత్య కేసు వ్యవహారం చూసిన తర్వాత బీజేపీకి, వైసీపీకి మధ్య పెద్ద సఖ్యత లేదని అర్థమవుతోంది. బహుశా అందుకే జగన్ అన్నిసార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లారేమో..! అయినా నో యూజ్..!!
సీబీఐ.. దేశంలోని అత్యున్నత సంస్థల్లో ఒకటి. కేసు ఏదైనా.. నేరం ఎలాంటిదైనా.. రాష్ట్రం పరిధి దాటి సీబీఐ చేతుల్లోకి వెళ్లిందంటే.. అతి తక్కువ సమయంలో అంతు చూస్తారనే పేరు ఉంది. ఐతే ఇదంతా ఒకప్పుడు ! సీబీఐ రోజురోజుకు అభాసుపాలవుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు.. సీబీఐని రాజకీయం కోసం వాడుకుంటున్నాయని.. సీబీఐని రాజకీయాలు కమ్మేశాయని.. పంజరంలో చిలకలా సీబీఐ మారిందనే విమర్శలు ఉన్నాయ్.
వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు కావాలని ఆదేశించింది. వాట్సాప్ ద్వారా అవినాష్‌కు నోటీసులు పంపించారు అధికారులు. కానీ అప్పటికే ప్లాన్ చేసిన ప్రోగ్రామ్స్ ఉన్న కారణంగా తాను విచారణకు రాలేనంటూ సీబీఐకి లేఖ రాశారు అవినాష్. తాను పులివెందుల వెళ్తున్నానని.. మరో నాలుగు రోజులు సమయం కావాలంటూ లేఖ రాశారు.
వివేకానంద రెడ్డి హత్యకేసులో కీలక విషయాలను వెల్లడించిన అవినాష్ రెడ్డి.
వివేకా హత్యకు ఆస్తి తగాదాలే కారణమని అవినాష్ రెడ్డి ఆరోపిస్తుంటే.. అసలు ఆస్తి గొడవలే లేవని షర్మిల చెప్పారు. దీంతో అవినాష్ రెడ్డి వాదనలకు వ్యతిరేకంగా వ్యవహారం సాగుతోంది. ఈ కేసులో జగన్ ఒకవైపు.. ఆయన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల మరోవైపు ఉన్నట్లు స్పష్టమవుతోంది.
అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఇకపై ఎప్పడైనా అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసే వీలుంది. వివేకా హత్య కేసులో తనను అరెస్టు చేయకుండా చూడాలని కోరుతూ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.