Home » Tag » YS Sharmila
విశాఖ ఉక్కును ఉద్ధరిస్తున్నామని కేంద్రం చెప్తున్నవన్నీ అసత్యాలే అని మండిపడ్డారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. స్టీల్ ప్లాంట్ మీద కేంద్రానికి ఉండేది ఎన్నటికీ సవతి తల్లి ప్రేమనే అని ఆరోపించారు.
మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు వైఎస్ షర్మిల. కాలయాపన తప్పా ఇచ్చిన హామీ నిలబెట్టుకునే బాధ్యత కనిపించడం లేదన్నారు.
అంబేద్కర్‌పై కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.
భారత రాజ్యాంగంపై బీజేపీ దాడి జరుగుతూనే ఉందని మండిపడ్డారు వైఎస్ షర్మిల. బాబాసాహెబ్ డాక్టర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడిచి బీజేపీ రాజ్యాంగం అమల్లోకి తెచ్చేందుకు కుట్రలు జరుగుతున్నాయనన్నారు.
కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్ర మంత్రి HD కుమారస్వామి గారు చేసిన వ్యాఖ్యలు మరో సారి రాష్ట్ర ప్రజలను అవమానించినట్లే అని మండిపడ్డారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వాటిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.
తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుభాకాంక్షలు చెప్పారు.
రేషన్ బియ్యం అక్రమాలపై విచారణకు స్పెషల్ సిట్ వేయడం సంతోషకరం అన్నారు వైఎస్ షర్మిల. మరి సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన రూ.1750 కోట్ల ముడుపులపై విచారణ ఎక్కడ ? అని ఆమె నిలదీశారు.
అదానీ పై అమెరికాలో దర్యాప్తు జరుగుతుందని... ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఏసీబీ నిద్రపోతుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.
వైసీపీ హయాంలో ఆస్తులు లాక్కోవడం ట్రెండ్‌గా మారితే.. వాటిని చూసి మౌనం వహించడం కూటమి సర్కార్ ట్రెండ్‌గా పెట్టుకుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేసారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటినా గత ప్రభుత్వం ధారాదత్తం చేసిన ఏ ఒక్క ఆస్తిపై, కనీసం ఒక్క చర్య కూడా లేదన్నారు. విచారణకు సైతం దిక్కులేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ షర్మిల అలజడి ఇప్పుడు వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఓ వైపు అధికారం కోల్పోయి నానా అవస్థలు పడుతోన్న జగన్ కు షర్మిల కంట్లో నలుసులా మారారు. ఇక జగన్ కూడా ఆమెను అనేక విధాలుగా రెచ్చగొట్టడంతో షర్మిల కూడా జగన్ పై రివెంజ్ మోడ్ లోనే ఉన్నారు.