Home » Tag » YS Sunitha
వైసీపీ అధినేత వైఎస్ జగన్కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు ఆయన సోదరి, వైఎస్ వివేకా కుమార్తె సునితా రెడ్డి. ఏపీ అసెంబ్లీకి ఈ ఉదయం వచ్చిన ఆమె... డిప్యూటి స్పీకర్ రఘురామా కృష్ణం రాజుతో భేటీ అయ్యారు.
వివేకా హత్య గురించి అటు వైఎస్ షర్మిల, సోదరి సునీత.. ఇటు అవినాష్ రెడ్డి, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మధ్యలో దస్తగిరి లాంటి వాళ్లు కూడా మాట్లాడుతున్నారు. అలాగే చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి కూడా అప్పుడప్పుడూ వివేకా హత్యపై స్పందిస్తున్నారు.
సీబీఐ దర్యాప్తు ఎందుకు త్వరగా పూర్తికావట్లేదు? వివేకాను చంపిన వారిని వదిలిపెడితే ఏం సందేశం వెళ్తుంది? నాన్నను గొడ్డలితో చంపారనే విషయం జగనన్నకు ఎలా తెలుసు? ఈ వివరాలన్నీ బయటకు రావాలి. వివేకా హత్యలో జగన్ పాత్రపైనా విచారణ చేయాలి.
వివేకా హత్య కేసు వ్యవహారం చూసిన తర్వాత బీజేపీకి, వైసీపీకి మధ్య పెద్ద సఖ్యత లేదని అర్థమవుతోంది. బహుశా అందుకే జగన్ అన్నిసార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లారేమో..! అయినా నో యూజ్..!!
తన తండ్రి హత్య కేసులో నిందితులెవరో తేల్చాలంటూ సునీత చేస్తున్న పోరాటం కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో అవినాష్ రెడ్డి ప్రమేయంపై ఆధారాలుండటంతో అతడ్ని అరెస్టు చేసే అవకాశాలున్నాయి. ఇది వైసీపీకి మచ్చగా మిగులుతుంది.
ఇన్నాళ్లు నందమూరి కుటుంబంపై విమర్శలు గుప్పిస్తూ వైసీపీ నేతలు పబ్బం గడుపుకుంటూ వచ్చారు. ఇప్పుడు ప్రత్యర్థులందరూ వై.ఎస్.ఫ్యామిలీని కూడా ఇదే విధంగా టార్గెట్ చేయడం ఖాయం. వీటికి వైసీపీ నేతలు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రత్యర్థుల సంగతి పక్కన పెడితే సునీత, షర్మిల సంధించే ప్రశ్నలకైనై వాళ్లు స్పందించక తప్పదు.
వివేకా రెండో భార్య వ్యవహారం మీడియాకు ఇప్పుడు బయటికొస్తోందేమో కానీ... సీబీఐ 2020లోనే షమీమ్ నుంచి వాంగ్మూలం తీసుకుంది. ఆమె చెప్పిన విషయాలన్నింటిపైనా ఆరా తీసింది. ఆ యాంగిల్లో కూడా సుదీర్ఘ విచారణ చేసేసింది. అవన్నీ చేసేసిన తర్వాత కేసు ఇక్కడి దాకా వచ్చింది.
వివేకా హత్య కేసులో వైసీపీ నేతలు రోజుకో మాట మాట్లాడుతూ అభాసుపాలవుతున్నారు. తమ మెడకు చుట్టుకుంటోందని భావించే ఇప్పుడు వైసీపీ నేతలు ఇలా మాట్లాడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
సీబీఐని ప్రబావితం చేసేంత స్థాయి చంద్రబాబుకు ఉందంటే ఎవరూ నమ్మరు. వైసీపీకి మాత్రమే ఆ సత్తా ఉంది. అయినా ఇంటిగుట్టు బయటపడిపోతుందనే భయంతోనే వైసీపీ నేతలు ఇలాంటి చిల్లర ఆరోపణలు చేస్తున్నారనే మాట ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.