Home » Tag » YS Viveka case
కేసులో ఏపీ సీఎం జగన్ పేరును ప్రస్తావించి ప్రకంపనలు సృష్టించింది సీబీఐ. ఈ హత్య విషయం జగన్‌కు ముందే తెలుసని సంచలన ఆరోపణలు చేసింది. హత్య గురించి ఎవరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకముందే ఎంవీ రామకృష్ణారెడ్డి జగన్‌కు సమాచారం ఇచ్చారని సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది.
వివేకా హత్యకు ఆస్తి తగాదాలే కారణమని అవినాష్ రెడ్డి ఆరోపిస్తుంటే.. అసలు ఆస్తి గొడవలే లేవని షర్మిల చెప్పారు. దీంతో అవినాష్ రెడ్డి వాదనలకు వ్యతిరేకంగా వ్యవహారం సాగుతోంది. ఈ కేసులో జగన్ ఒకవైపు.. ఆయన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల మరోవైపు ఉన్నట్లు స్పష్టమవుతోంది.
రాష్ట్రంలో అత్యంత సంచలనం సృష్టించిన కోడి కత్తి కేసుతోపాటు వివేకా హత్య కేసు ఎటూ తేలడం లేదు. అందరికీ అన్నీ తెలుసు. కానీ, న్యాయమే జరగదు. వివేకాది హత్య అని అందరికీ తెలుసు. ఈ కేసులో పాత్రధారుల గురించి అవగాహన ఉంది. కానీ, సీబీఐ కూడా ఈ కేసును ఇప్పటికీ పరిష్కరించలేకపోతోంది.
మొన్నటి వరకూ ఎంపీ అవినాష్ రెడ్డిని సాక్షిగానే పరిగణించిన సీబీఐ.. ఇప్పుడు మాత్రం రిమాండ్ రిపోర్ట్‌లో నిందితుడిగా చేర్చింది. వివేకా హత్య అనంతరం ఆధారాలు మాయం చేయడంలో అవినాష్ రెడ్డి పాత్ర కూడా ఉందని ఆరోపించింది.